Silver Medal : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో షూటింగ్ విభాగంలో ఇండియాకు మరో మెడల్ వచ్చింది. ఈరోజు ఉదయాన్నే జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు సిల్వర్ మెడల్ వచ్చింది. సరబ్‌జోత్ సింగ్, దివ్య తాడిగోల్ లతో కూడిన టీమ్ ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. వాస్తవానికి ఈ ఫైనల్ మ్యాచ్ తొలి రౌండ్లలో భారత్ టీమ్ ఆధిక్యాన్ని కనబర్చింది. కానీ మ్యాచ్ మధ్య దశ నుంచి జాంగ్, జియాంగ్ లతో కూడిన చైనా టీమ్ క్రమంగా ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో ఆ టీమ్ కే గోల్డ్ మెడల్ దక్కింది. ఇండియా సిల్వర్ మెడల్ తో (Silver Medal) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే ఈవెంట్ లో కాంస్య పతకం కోసం పాకిస్థాన్, జపాన్, కొరియా, ఇరాన్ జట్లు తలపడుతున్నాయి.
Also read : Mystery Box – Vizag Beach : వైజాగ్ బీచ్ లో 100 టన్నుల మిస్టరీ బాక్స్.. లోపల ఏముంది ?
ఇవాళ కీలక ఈవెంట్స్ ఇవీ..
ఆసియా క్రీడల్లో పతకాల వేటలో భారత్‌కు కీలక ఆటగాళ్లైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రోహన్- బోపన్న, రుతుజా భోసలే వంటి స్టార్ ఆటగాళ్లు ఈరోజు బరిలోకి దిగుతున్నారు. స్క్వాష్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇండియా పురుషుల హాకీ టీమ్ ఇవాళ పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ నేడు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. పురుషుల 1500 మీటర్ల పోరులో అజయ్ కుమార్ సరోజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో మురళీ శ్రీశంకర్, మహిళల 100 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజి ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరంతా ఈరోజు ఫైనల్ పోరులో గోల్డ్ మెడల్ కోసం తలపడనున్నారు.