Site icon HashtagU Telugu

Sara-Gill Love: తెరపైకి సారా – గిల్ లవ్

Sara-Gill Love

New Web Story Copy 2023 09 09t165621.314

Sara-Gill Love: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్, టీమిండియా ఆటగాడు శుభ్ మన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని కొంతకాలంగా చర్చ నడుస్తుంది. వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. రెస్టారెంట్ లలో సారా శుబ్మన్ దిగిన ఫోటోలు లీక్ కావడంతో వీళ్ళిద్దరిమధ్య ప్రేమ నిజమనే దానికి బలం చేకూరింది. అయితే ఈ ముచ్చట రోజూ ఉండేదే. నిన్న సెప్టెంబర్ 8న శుభ్ మన్ గిల్ పుట్టినరోజు. గిల్ బర్తడే సందర్భంగా సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీలు గిల్ కి విషెష్ తెలిపారు. అందులో సచిన్ కూడా ఉండటం గమనార్హం. సచిన్ గిల్ కి బర్తడే విశేష్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో సారా గిల్ ప్రేమాయణం మరోసారి తెరపైకి వచ్చింది. సచిన్ ట్వీట్ చేయడానికి సారా కారణమని కొందరి కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో సచిన్ ట్వీట్ పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.దీంతో అందరు అనుకున్నట్టుగానే ఊహాగానాలకు ఆజ్యం పోసినట్టయింది.

Also Read: CBN Vote for Note Advocate : చంద్ర‌బాబు కేసు వాదించే అడ్వ‌కేట్ లూథ్రా ఎవ‌రు?