Sara Ali Khan: సినిమా తారలు ఎవరితోనైనా కనిపిస్తే వార్తల్లోకెక్కడం ఖాయం. కొన్నిసార్లు ఈ బంధానికి ప్రేమ అని కూడా పేరు పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వార్తలపై స్టార్స్ కూడా స్పందించాల్సి వస్తోంది. నటి సారా అలీ ఖాన్ (Sara Ali Khan) విషయంలోనూ అదే జరిగింది. గత కొంతకాలంగా సారా- క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గిల్ తో డేటింగ్ పై సారా సమాధానం ఇదే
చాలా సందర్భాలలో ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. శుభ్‌మన్ ఈ సారాతో లేడని, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ఉన్నారని సమాచారం రావడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడు తనకు శుభ్‌మాన్‌తో సంబంధం లేదని సారా అలీ ఖాన్ స్వయంగా ఈ వార్తలను ధృవీకరించారు. చిత్రనిర్మాత కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ 8లో సారా ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చాయని కరణ్ సారాను అడిగినప్పుడు? ఆ సారా తాను కాదని వెల్లడించింది.
Also Read: NTR : వార్ 2 కి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేశాడా.. తారక్ సెట్స్ లో అప్పుడే వస్తాడా..?
Finally SARA ka SARA confusion clear ho gya 🤌💜
Thanks #SaraAliKhan for this #ShubmanGill #SaraTendulkar pic.twitter.com/iHuNtsJ8rn— 𝙍𝙞𝙖𝙨𝙝𝙖♡𝟳𝟳♡ (@datduskygirl77) November 6, 2023
గిల్‌తో తనకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. “అబ్బాయిలు.. మీరు అర్థం చేసుకుంటున్నారు.. సార కా సార దునియా గలాత్ సార కే పీచయ్ పద హై (ప్రపంచమంతా వేరే సారా వెంట ఉంది)..” అని తెలిపింది. ఈ సమాధానంతో షోలో ఉన్న కరణ్, అనన్య పాండే బిగ్గరగా నవ్వారు. ఆ సారా తాను కాదని చెప్పటంతో సారా టెండూల్కర్- గిల్ బంధం నిజమే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను, అనన్య ఒకే వ్యక్తితో డేటింగ్ చేశామని సారా అంగీకరించింది. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు.
We’re now on WhatsApp : Click to Join