Site icon HashtagU Telugu

Sanju Samson: విండీస్ టూర్ లో సంజూ శాంసన్ కు ఛాన్స్

Sanju Samson

New Web Story Copy (75)

Sanju Samson: సంజూ శాంసన్…టాలెంట్ ఉన్న వికెట్ కీపర్…అప్పుడప్పుడూ జాతీయ జట్టులో చోటు దక్కినా దానిని నిలబెట్టుకోలేకపోతున్నాడు. అయితే మిగిలిన ప్లేయర్స్ తో పోలిస్తే మాత్రం సంజూ కి సెలక్టర్లు ఇచ్చిన అవకాశాలు మాత్రం తక్కువే. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించినా పలుసార్లు అతన్ని పక్కన పెట్టారు. దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వెస్టిండీస్ టూర్ కోసం సంజూకి చోటు దక్కనుంది. వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుండగా…విండీస్ తో సీరీస్ కు పలువురు యువ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నారు. ఆ జాబితాలో సంజూ శాంసన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సంజూని వన్డే , టీ ట్వంటీ టీమ్స్ లోకి తీసుకోనున్నారు. చివరి సారిగా ఈ కేరళ వికెట్ కీపర్ శ్రీలంకతో టీ ట్వంటీ ఆడాడు. ఆ తర్వాత గాయంతో దూరమవడం…మళ్లీ ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సారి ఐపీఎల్ సీజన్ లో సంజూ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు.13 మ్యాచ్ ల్లో 360 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

పంత్ గాయంతో టీమ్ కి దూరమైన తర్వాత వికెట్ కీపింగ్ రేసులో ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ ఉన్నారు. వన్డే ప్రపంచ కప్ టీమ్ కి ఎంపిక అవ్వాలంటే..ఈ లోపు ఉన్న సీరీస్ ల్లో ఛాన్స్ దక్కించుకుని.. సత్తా చాటాలి. దీనికి సంబంధించి విండీస్ టూర్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. కోహ్లీ , రోహిత్ , షమీ , సిరాజ్ వంటి ప్లేయర్స్ కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉండడంతో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. విండీస్ టూర్ లో వన్డే జట్టుకు హర్ధిక్ పాండ్య కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది.

కాగా ఐపీఎల్ తో పాటు దేశవాళీలో మెరుస్తున్న యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లతో పాటు పంజాబ్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తున్నది. త్వరలో విండీస్ టూర్ కు భారత జట్టును ప్రకటించనున్నారు.భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. జులై 12 నుంచి మొదలయ్యే తొలి టెస్టుతో భారత పర్యటన మొదలవుతుంది. ఆగస్టు 13న జరిగే చివరి టీ ట్వంటీతో పర్యటన ముగుస్తుంది.

Read More: Sports Minister Of Pakistan: పాక్ సీనియర్ క్రికెటర్‌కు మంత్రి పదవి