Site icon HashtagU Telugu

Sanju Samson : భీకర ఫామ్ లో సంజూ.. టైటిల్ పై ఆర్ఆర్ ఆశలు

Sanju Samson

Sanju Samson

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో అదరగొడుతున్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో సంజూ మరోసారి విద్వాంకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు. కేరళకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ గోవాతో జరిగిన మ్యాచ్ లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. సంజూ విధ్వంసానికి గోవా బౌలర్లు బలయ్యారు. ఈ మ్యాచ్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

సంజూ శాంసన్ తుఫాను ఇన్నింగ్స్ ఆధారంగా కేరళ 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 15 బంతుల్లో 31 పరుగులు, సల్మాన్ నిజార్ 20 బంతుల్లో 34 పరుగులు మరియు అబ్దుల్ బాసిత్ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ కి ముందు సంజూ బ్యాట్ విలయతాండవం చేస్తుంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన 5 టి20 సిరీస్ లో సంజూ మూడు సెంచరీలతో కదం తొక్కాడు. దీంతో అంతర్జాతీయ టీ20లో 5 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా 3 సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.ఇక సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావడం రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సాధారణంగా సంజు ఐపీఎల్ లీగ్‌లో బాగా రాణిస్తాడు. కానీ ఈసారి విదేశీయులతో జరుగుతున్న మ్యాచ్ లలోను దుమ్ముదులిపేస్తున్నాడు. తద్వారా రాజస్థాన్ సంజుపై భారీ ఆశలు పెట్టుకుంది.

గత సీజన్లోనూ ఆర్ఆర్ టైటిల్ కు దగ్గరగా వెళ్ళింది. అయితే క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. దాంతో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న రాజస్థాన్ కల మరోసారి చెదిరిపోయింది. అయితే వచ్చే సీజన్లో సంజూ సారధ్యంలో రాజస్థాన్ కచ్చితంగా టైటిల్ కొడుతుందని యాజమాన్యం భావిస్తుంది. వచ్చే సీజన్లో యశస్వి జైస్వాల్‌తో కలిసి శాంసన్ ఓపెనింగ్ చేయనున్నాడు. పైగా జైస్వాల్ కూడా అద్భుత ఫామ్ లో ఉన్నాడు. వీళ్లిద్దరు రాణిస్తే ఆర్ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది.

Read Also : Floater Credit Cards : ఫ్లోటర్‌ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏమిటి ? వాటిని ఎలా వాడాలి ?