Site icon HashtagU Telugu

India vs Afghanistan: టి20 ప్రపంచకప్ కు ముందు బీసీసీఐ స్కెచ్

India vs Afghanistan

India vs Afghanistan

India vs Afghanistan: భారత్‌-అఫ్గాన్‌ల మధ్య మూడు టీ20 మ్యాచ్లు జనవరి 11, 14, 17 తేదీలలో జరుగుతాయి. స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో రోహిత్, కోహ్లీలను ఈ సిరీస్ కు ఎంపిక చేశారు. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ పొట్టిఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. వీరిద్దరు 2022లో టీ20 వరల్డ్ కప్‌లో చివరిగా భారత్ తరపున టీ20 ఆడారు.

గతేడాది టి20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ వన్డే, టెస్టుల్లో మాత్రమే ఆడారు. ఒక దశలో ఈ స్టార్ ప్లేయర్స్ టి20 లకు గుడ్ బై చెప్పబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే గత ఏడాది చివర్లో జరిగిన ప్రపంచకప్ లో ఓడిన భారత్ టి20 ప్రపంచకప్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో విరాట్, రోహిత్ లేకపోతే ప్రపంచకప్ గెలవడం కాస్త కష్టమని భావించిన బీసీసీఐ వారిద్దరిని జట్టులోకి తీసుకున్నారు. 16 మందితో కూడా భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్,టెస్టు సిరీస్ ఆడిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు ఈ సిరీస్ లో ఛాన్స్ దక్కలేదు. ఇక ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కి స్థానం దక్కగా.. వికెట్ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజు శాంసన్‌ని తీసుకున్నారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ కూడా విశ్రాంతిని ఇచ్చారు.

గాయాలతో హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ షమి జట్టుకు దూరమయ్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ గాయపడగా, ప్రపంచకప్ సమయంలో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఇక స్పిన్నర్ చాహల్‌కు మరోసారి నిరాశే మిగిలింది. చాహల్‌కు బదులుగా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కే సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇషాన్ కిషన్‌కు ని జట్టులోకి తీసుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ సిరీస్ కు ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఛాన్స్ దక్కించుకున్నాడు.ఇక ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కి స్థానం దక్కగా.. వికెట్ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజు శాంసన్‌ని తీసుకున్నారు.జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న రెండో టీ20, బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరుగుతుంది.ఆఫ్ఘన్ సిరీస్ కు ఎంపికైన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ , శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ , సంజు శాంసన్ , శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ లు ఉన్నారు

Also Read: Hyderabad: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు కారు భీభత్సం