Site icon HashtagU Telugu

RR vs SRH: సందీప్ నోబాల్ డ్రామాపై సంజూ శాంసన్ రియాక్షన్

RR vs SRH

Sanju Samson

RR vs SRH: సొంత మైదానంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో సందీప్ శర్మ వేసిన నోబాల్ రాజస్థాన్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ ఓడించింది. మ్యాచ్ తర్వాత సంజూ శాంసన్ కూడా దీన్ని అంగీకరించాడు. ఇలాంటి మ్యాచ్‌లు ఐపీఎల్‌కు మరింత ప్రత్యేకతను ఇస్తాయని, అయితే నో బాల్ మొత్తం మ్యాచ్‌ని మార్చిందని చెప్పాడు. సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ఓవర్‌స్టెప్ చేయడం వల్ల ఆర్ఓఆర్ ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో నెటిజన్లు సందీప్ పై ట్రోల్స్ చేస్తున్నారు. గెలవాల్సిన మ్యాచ్ ను చేతులారా ఓడించావ్ అంటూ మండిపడుతున్నారు.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. సందీప్‌ శర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. కానీ సందీప్ వేసిన నోబాల్ ని అబ్దుల్ సమద్ బాగా వాడుకున్నాడు. బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే జీవితంలో ఈ ఫార్మాట్‌లో ఆడటం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు సంజు. కాగా.. రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. గత 6 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ ఐదు ఓడి, ఒక మ్యాచ్‌లో గెలిచింది. 10 పాయింట్లతో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు.

Read More: GT vs LSG Highlights: హోంగ్రౌండ్‌లో దుమ్మురేపిన గుజరాత్‌.. లక్నోపై ఘనవిజయం