IPL 2023: సంజూని ధోనితో పోల్చిన గ్రేమ్ స్వాన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ నాయకత్వ సామర్థ్యంపై ఇంగ్లండ్ మాజీ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన ప్రకటన చేశాడు.

Published By: HashtagU Telugu Desk
ipl 2023

Whatsapp Image 2023 05 11 At 10.00.02 Pm

IPL 2023: మిస్టర్ కూల్ ధోని టీమిండియాకు దూరమై ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అతని స్వాగ్ మిస్ అవ్వలేదు. దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఓర్పు, సహనం అవసరం. ఆ రెండు ధోనికి సమపాళ్లలో ఉన్నాయి. ప్రస్తుతం మాహీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో చెన్నై దూసుకుపోతుంది. పడుతూ లేస్తూ చెన్నై ప్రదర్శన సాగుతుంది. అయితే ఇదివరకెప్పుడూ మాహితో మరో క్రికెటర్ని పోల్చడం జరగలేదు. తాజాగా ఓ సీనియర్ క్రికెటర్ సంజూ శాంసన్ ని ధోనితో పోల్చడం చర్చనీయాంశమైంది.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ నాయకత్వ సామర్థ్యంపై ఇంగ్లండ్ మాజీ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన ప్రకటన చేశాడు. సంజూ శాంసన్ కెప్టెన్సీని ప్రశంసించిన స్వాన్, అతని కెప్టెన్సీని మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చాడు.

జియో సినిమాతో మాట్లాడిన స్వాన్ సంజూ శాంసన్ పై తన అభిప్రాయాన్ని తెలిపాడు “సంజూ శాంసన్ గొప్ప నాయకుడిగా ఎదగడం మరియు అపారమైన ప్రతిభ ఉన్న సీనియర్ ఆటగాడి పాత్రను కొనసాగించడం అతని గొప్పదనం అని నేను భావిస్తున్నాను అని అన్నాడు. సంజు శాంసన్ మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. సంజూ ఎప్పుడూ సహనాన్ని కోల్పోలేదు, సంజూ తన కెప్టెన్సీలో ఎంఎస్ ధోని లాంటివాడని నేను భావిస్తున్నాను అంటూ సంజూపై ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుత ఐపీఎల్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ప్రస్తుత సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 154.77గా ఉంది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఈ ఏడాది కూడా రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంటుందని చాలా మంది నమ్ముతున్నారు.

Read More: KKR vs RR: హెట్మెయర్ కళ్లుచెదిరే క్యాచ్

  Last Updated: 11 May 2023, 10:11 PM IST