LSG vs RR: ఎదురులేని రాజస్థాన్..లక్నోపై రాజస్థాన్ విజయం..

లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. గతంలో రాజస్థాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో లక్నో జట్టు విఫలమైంది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ మరియు ధృవ్ జురెల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

LSG vs RR: లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. గతంలో రాజస్థాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో లక్నో జట్టు విఫలమైంది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ మరియు ధృవ్ జురెల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా రాజస్థాన్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది ఎనిమిదో విజయం. ఈ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మొదటి స్థానంలో కొనసాగుతుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 76 పరుగులు చేసిన తర్వాత అవేశ్ ఖాన్‌కు బలయ్యాడు. దీపక్ హుడా 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. క్వింటన్ డికాక్ (8) పరుగులకే చేతులేత్తేయగా, నికోలస్ పూరన్ (11), ఆయుష్ బదోని (18), కృనాల్ పాండ్యా (15) పరుగులు చేశారు. 197 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ టాపార్డర్ బ్యాటర్లు ఒక్కొక్కరు వెంటవెంటనే వికెట్ సమర్పించుకున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (34), రియాన్ పరాగ్ (14) పరుగులు చేయగా.. కెప్టెన్ సంజూ శాంసన్ జట్టు అద్భుత ప్రదర్శన చేశాడు. సంజు 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ లతో 71 నాటౌట్ గా నిలిచాడు.ధ్రువ్ జురెల్ (52 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్)తో అర్ధశతకాలు బాది జట్టును విజయతీరాలకు చేర్చారు.

We’re now on WhatsAppClick to Join

రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 4 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. బౌల్ట్‌, అశ్విన్‌, అవేశ్‌ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు. కాగా సంజూ శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’.. మే 10న గ్రాండ్ రిలీజ్