Site icon HashtagU Telugu

Samson Controversial Dismissal: సంజూ శాంస‌న్ వికెట్‌పై వివాదం.. అస‌లేం జ‌రిగిందంటే..?

Samson Controversial Dismissal

Safeimagekit Resized Img 11zon

Samson Controversial Dismissal: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Samson Controversial Dismissal) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సంజూ తన ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ను విజ‌యతీరాల‌కు చేర్చ‌లేక‌పోయాడు. ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన‌ 56వ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ శాంసన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 16వ ఓవర్లో సంజూ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గందరగోళం నెలకొంది.

సంజూ వికెట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్త్ జిందాల్, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర కూడా ఈ విషయంలోకి ప్రవేశించారు. కొద్దిసేపటికే విషయం తీవ్రస్థాయికి చేరుకుంది. కానీ చివరికి సంజును ఔట్ చేయడం రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. అస‌లు ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Delhi Capitals : హోంగ్రౌండ్‌లో అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి

మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతికి సంజూ శాంసన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు. ముఖేష్.. సంజుకు బంతిని విసిరాడు. శాంస‌న్ దానిని లాంగ్ ఆన్ వైపు బలమైన షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే షాయ్ హోప్ బౌండరీకి ​​చాలా దగ్గరగా నిలబడి క్యాచ్ అందుకున్నాడు. అతని పాదం బౌండరీ లైన్ తాడును తాకినట్లు కనిపించింది. దీని తర్వాత థర్డ్ అంపైర్ హోప్ క్యాచ్‌ను తనిఖీ చేయగా, సంజును ఔట్‌గా ప్ర‌క‌టించాడు. విషయం ఇక్కడితో ముగియలేదు. థర్డ్ అంపైర్ ఔట్ అయిన తర్వాత కూడా సంజూ మైదానం వీడేందుకు సిద్ధంగా లేడు. తన వికెట్ విషయంలో అంపైర్‌తో సంజు చాలా సేపు వాదించాడు. సంజు కూడా రివ్యూ తీసుకోవాలనుకున్నాడు. అయితే ఈ నిర్ణయం థర్డ్ అంపైర్ మాత్రమే ఇచ్చాడని అంపైర్ అతనిని ఆపాడు.

We’re now on WhatsApp : Click to Join

ఈ వివాదం మైదానంలోనే ఆగిపోలేదు. మైదానం వెలుపల కూడా సంజూ వికెట్ విషయంలో వివాదం చెలరేగింది. ఓ వైపు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర కోపంగా కనిపించ‌గా.. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్త్ జిందాల్ మాత్రం సంజూని ఔట్ చేయమని స్టాండ్స్ నుండి సిగ్నల్ ఇచ్చాడు. అయితే చివరకు అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించి సంజూ తిరిగి పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. సంజూ వికెట్‌పై ఫ్యాన్స్ ర‌కర‌కాల స్పందిస్తున్నారు.