Sanju Samson: టీమిండియాలో సంజు శాంసన్ ని అన్ లక్కీ ప్లేయర్ గా ట్రీట్ చేస్తారు. కావాల్సినంత ఆట సామర్థ్యం ఉన్నప్పటికీ ఆడే అవకాశాలు అంతంత మాత్రమే. అందుకే సంజు ఫ్యాన్స్ కి బీసీసీఐ అంటే అస్సలు పడదు. తోటి ఆటగాళ్లు అయిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు టీమ్ఇండియాలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నప్పటికీ శాంసన్‌కు మాత్రం ఎందుకనో అదృష్టం కలిసేరాదు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సంజు ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నాడు.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక టూర్లో ఉంది. తొలి టి20లో అవకాశం రాణి సంజుకి రెండో టి20 మ్యాచ్ లో ఆడే అవకాశం లభించింది. అయితే సంజు మళ్ళీ నిరాశేపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం లభించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గొంతు నొప్పి కారణంగా బయటకు రావాల్సి వచ్చింది. అయితే సంజూ శాంసన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అటుంచితే గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు. తీక్షణ తన స్పెల్‌లో తొలి బంతికే సంజూ శాంసన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఇక భారత్ ఛేజింగ్ లో 3 బంతులు మొదలవ్వగానే వర్షం పడింది. ఆ తర్వాత లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లలో 78 రన్స్ గా అంపైర్లు నిర్దేశించారు. తొలి ఓవర్లో భారత్ 12 పరుగులు చేసింది. జైస్వాల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
అయితే సంజూ శాంసన్ మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరుకున్నాడు. బంతి మిడిల్ స్టంప్‌కు తగిలడంతో శాంసన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. భారత బ్యాటర్లలో జైస్వాల్ 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు, హార్ధిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. దీంతో మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే సంజూ గోల్డెన్ డక్ కారణంగా బాధపడాలో, టీమిండియా సిరీస్ గెలిచిందని సంతోష పడాలో అతని ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు.
Also Read: Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం