Site icon HashtagU Telugu

IND vs WI 1st ODI: సంజూని కాదని సూర్యని తీసుకోవడం అవసరమా?

IND vs WI

New Web Story Copy (71)

IND vs WI 1st ODI: పొట్టి క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ ప్రమాదకర ఆటగాడనేది అందరికీ తెలిసిందే. అయితే వన్డే ఫార్మెట్లో సూర్య ప్రదర్శన చెప్పుకునే అంతగా లేదు. వన్డేల్లో వరుసగా ప్లాప్ అవుతున్న సూర్యని బీసీసీఐ సెలెక్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత రాత్రి టీమిండియా వెస్టిండీస్ తో జరిగిన మొదటి వన్డేలో ఘన విజయం సాధించింది. అయితే బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాటర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. స్వల్ప టార్గెట్ కావడంతో టీమిండియా నెట్టుకొచ్చింది. అయితే సూర్య కుమార్ యాదవ్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంజు శాంసన్ ని పక్కనపెట్టడం, సూర్యకి అవకాశం ఇవ్వడంపై విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు. గత మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

టీ20 క్రికెట్‌లో నంబర్ 1 బ్యాటర్‌ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. పదే పదే అవకాశాలు వచ్చినా మన సూర్యుడు ఏ మాత్రం వెలగడం లేదు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. దీంతో సూర్యపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం జోరందుకుంది. వరుసగా విఫలమవుతున్న సూర్య స్థానంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే మేనేజ్మెంట్ మాత్రం సూర్యని వదలడం లేదు. మొత్తానికి వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్‌ని ఎలాగైనా ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్టుంది.

Also Read: Heavy Floods : మోరంచపల్లి లో నీరు పోయింది..కన్నీరు మిగిలింది