Site icon HashtagU Telugu

Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు గాయం.. ఎలా అయ్యాడో చూడండి!

Serious Injury Replacement

Serious Injury Replacement

Rishabh Pant: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) తీవ్ర గాయంతో బాధపడుతున్నాడు. మాంచెస్టర్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కాలికి గాయం కావడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్లాస్టర్ కట్టిన పాదంతో ఉన్న ఫోటోను పంత్ షేర్ చేయగా, అది కోట్లాది మంది అభిమానులను కలచివేసింది. ఈ గాయం కారణంగా పంత్ ఓవల్‌లో జరిగే ఐదవ టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

రిష‌బ్ పంత్ హృదయవిదారక ఫోటో

పంత్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా షేర్ చేసిన పంత్ ఫోటో ఒకటి అభిమానుల హృదయాలను కదిలించింది. ఆ ఫోటోలో పంత్ పాదానికి ప్లాస్టర్ కట్టి ఉంది. అంతేకాదు కర్ర సహాయంతో నడుస్తున్నాడు. గాయం తీవ్రత కారణంగా పంత్ సహాయం లేకుండా నిలబడలేకపోతున్నాడు.

Also Read: Naag Panchami 2025 : పుట్టలో పాలు పోయాలా వద్దా? నాగపంచమి, నాగులచవితి వెనక ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత ఏంటి?

మాంచెస్టర్ టెస్ట్‌లో గాయం

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు తిరిగి వెళ్ళాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తగలకుండా అతని పాదం బొటనవేలికి తాకింది. దీంతో క్రీజ్‌లో నిలబడటం కూడా కష్టమైంది. అయినా జట్టుకు అవసరం ఉన్నప్పుడు పంత్ కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ సెంచరీ కూడా సాధించాడు. పంత్ గురించి లక్నో జట్టు యజమాని మాట్లాడుతూ.. “ఓర్పు, చరిత్ర, దృఢ సంకల్పం, అన్నింటికంటే కట్టుబాటు ఇది రిష‌బ్ పంత్” అని ప్రశంసించారు. ఇక‌పోతే ఇంగ్లాండ్- భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన నాల్గ‌వ టెస్ట్ డ్రా అయిన సంగ‌తి తెలిసిందే.