Sania One Word : ఒక్క పదంతో సానియా మీర్జా ఇన్‌స్టా పోస్ట్.. దాని అర్థం అదేనా?

Sania One Word : పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తొలిసారిగా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
Sania One Word

Sania One Word

Sania One Word : పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తొలిసారిగా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఒక పోస్టు పెట్టారు. అందులో ఒకే ఒక పదాన్ని వాడారు.. అదే  ‘రిఫ్లెక్ట్’  !! అద్దం ముందు నిలబడిన తన ఫొటోను పోస్ట్ చేసిన సానియా.. దానికి ‘రిఫ్లెక్ట్’(Sania One Word)  అనే క్యాప్షన్‌ను పెట్టారు.  ఇటీవల సానియా మీర్జా కుటుంబం కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సానియా మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. బహుశా అది కూడా ఆమె జీవితంలో జరుగుతున్న మార్పులతో ముడిపడినదే అయి ఉండొచ్చు. ఆ పోస్టులో సానియా ఏం రాశారంటే..  ‘‘పెళ్లి కష్టం, విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి..  ఊబకాయం కష్టం, ఫిట్‌గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి.. అప్పులు చేయడం కష్టం, ఆర్థిక క్రమశిక్షణ కష్టం.. మీ కష్టాన్ని ఎంచుకోండి. కమ్యూనికేషన్ కష్టం. కమ్యూనికేట్ చేయడం కష్టం కాదు. జీవితం ఎప్పుడూ సులభం కాదు. నేను ఎప్పుడూ కష్టపడతాను. కానీ మనం మన కష్టాన్ని ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి’’ అని పేర్కొన్నారు. బహుశా వీటిలోని ఏవో కొన్ని అంశాల వల్ల షోయబ్, సానియా మధ్య గ్యాప్‌ పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘సానియా మీర్జా ఎల్లప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతారు. కానీ షోయబ్, సానియా విడాకులు తీసుకున్న కొన్ని నెలల తర్వాత  ఆ వివరాలను ఇప్పుడు ప్రకటించాల్సి వచ్చింది.  షోయబ్ కొత్త ప్రయాణానికి సానియా శుభాకాంక్షలు తెలిపారు. ఖులానామా ద్వారా ఇద్దరూ విడిపోయారు’’ అని ఇటీవల సానియా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సానియా జీవితంలోని ఈ సున్నితమైన సమయంలో అందరూ ఆమెకు మద్దతుగా నిలవాలి. ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా, ఆమె వ్యక్తిగత జీవిత గోప్యత అవసరాన్ని గుర్తించాలని అభిమానులు, శ్రేయోభిలాషులందరినీ కోరుతున్నాం’’ అని సానియా మీర్జా కుటుంబం తెలిపింది.  దీంతో కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్ విడిపోయారనే విషయం ఆలస్యంగా వచ్చింది.  ఇటీవల నటి సనా జావెద్‌తో షోయబ్ మాలిక్‌ పెళ్లి చేసుకున్నారు.  2010 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సానియా, షోయబ్ పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల కిందటే ఇన్‌స్టాగ్రామ్‌లో సానియామీర్జాను షోయబ్ మాలిక్ అన్‌ఫాలో చేశారు.  వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజాన్ ఉన్నారు. అతడు తల్లి సానియా మీర్జాతోనే నివసిస్తున్నాడు.

Also Read : Foxconn – Padma Bhushan : యాంగ్ లీకి పద్మభూషణ్.. ఇండియాలో తైవాన్ వెలుగులు.. ఎవరాయన ?

  Last Updated: 26 Jan 2024, 10:52 AM IST