Site icon HashtagU Telugu

Sania Mirza Retirement: రిటైర్మెంట్ పై సానియా మీర్జా కీలక ప్రకటన

Sania Mirza

Sania Mirza

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా (Sania Mirza) రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే WTA 1000 టోర్నీతో తాను ఆటకు ముగింపు పలకనున్నట్లు వెల్లడించారు. గత ఏడాదే ఆట నుండి తప్పుకోవాలని అనుకున్న సానియా, ఆ తర్వాత మనసు మార్చుకొని ఆటలో కొనసాగారు. ఈ నెల 16న జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత దుబాయ్ లో సానియా మీర్జా తన చివరి టోర్నీ ఆడనుంది.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ తర్వాత భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పనుంది. వచ్చే నెలలో దుబాయ్ డ్యూటీ ఛాంపియన్‌షిప్ టోర్నీ జరగనుంది. వాస్తవానికి సానియా మీర్జా గత సంవత్సరం US ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే గాయం కారణంగా ఆమె టోర్నమెంట్‌లో ఆడలేకపోయింది. ఆ తర్వాత ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంది.

Also Read: India vs Sri Lanka: నేడు మూడో టీ20.. సిరీస్​పై కన్నేసిన ఇరుజట్లు..!

సానియా మీర్జా కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఈ భారతీయ టెన్నిస్ స్టార్ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో 6 మేజర్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. సానియా మీర్జా 3 సార్లు డబుల్స్, 3 సార్లు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ నెలలో సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన కజకిస్థాన్ భాగస్వామి అన్నా డానిలియాతో కలిసి కోర్టుకు హాజరుకానుంది.

విశేషమేమిటంటే.. సానియా మీర్జా గత 10 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. దుబాయ్‌లో సానియా మీర్జాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ విధంగా సానియా మీర్జా అభిమానుల మధ్య టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది. సానియా మీర్జాకు ఉన్న స్వల్ప ఇబ్బందుల కారణంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం లేదని.. కేవలం తన ఆట విషయంలో తనకున్న లక్ష్యాలను అధిగమించడం కారణంగానే వైదొలగుతున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వూలో వెల్లడించింది. 36 ఏళ్ల టెన్నిస్ స్టార్ పాక్ క్రికెటర్ మాలిక్‌ని 2010లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నాలుగేళ్ల కొడుకుతో దుబాయ్‌లో ఉంటోంది. అక్కడే టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.