Site icon HashtagU Telugu

Sania Mirza Confirms Retirement: రిటైర్మెంట్‌పై అధికారిక ప్రకటన చేసిన సానియా

Sania Mirza

Tennis Star Sania's Net Worth Is Around Rs. 200 Crores

భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌తో రిటైర్మెంట్ ప్రకటించింది. WTA 1000 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడడం ద్వారా తన కెరీర్‌ను ముగించుకుంటానని గతంలో రిటైర్మెంట్ గురించి చెప్పిన సానియా, ఇప్పుడు ఆమె మనసు మార్చుకుంది. జనవరి 16న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన తర్వాతే సానియా తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ ఈవెంట్‌లో కజకిస్థాన్‌కు చెందిన అనా డానిలినాతో సానియా పోటీపడనుంది.

2005లో తన గ్రాండ్‌స్లామ్ కెరీర్ ప్రారంభమైంది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తోనే అని అందుకే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడతానని, ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి జరిగే దుబాయ్ ఓపెన్‌తో తన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నానని సానియా వెల్లడించింది. 20ఏళ్ల తన ప్రొఫెషనల్ కెరీర్‌లో కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొంది.

Also Read: Lion: సింహాన్ని గిరగిరా తిప్పేసిన మహిళ.. షాకింగ్ వీడియో వైరల్!

30 ఏళ్ల కిందట తల్లితో కలిసి నిజాం క్లబ్ లో టెన్నిస్ నేర్చుకునేందుకు ఓ పాప వెళ్లిందని, కానీ ఇంత చిన్న వయసులో టెన్నిస్ ఎలా నేర్చుకుంటావని అక్కడి కోచ్ అన్నాడని సానియా గుర్తుచేసుకుంది. ఆరేళ్ల వయసు నుంచే కలలను సాకారం చేసుకునేందుకు ఆ పాప పోరాటం మొదలుపెట్టిందని వివరించింది. సమస్యలు, ఇబ్బందులు, అనేక కష్టాలను ఎదుర్కొని 50 గ్రాండ్ స్లామ్స్ ఆడానని, కొన్ని టైటిళ్లు కూడా గెలిచానని సానియా వెల్లడించింది. అయితే, పోడియంపై త్రివర్ణ పతాకంతో నిలబడడాన్ని అత్యుత్తమ గౌరవంగా భావిస్తానని సానియా తన దేశభక్తిని చాటింది. 20 ఏళ్ల తన ప్రొఫెషనల్ కెరీర్ లో కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొంది. ఇక కొత్త జీవితం ప్రారంభిస్తానని, తన కుమారుడి కోసం అత్యధిక సమయం కేటాయిస్తానని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా మహిళల టెన్నిస్‌లో సానియా మీర్జా భారత్‌కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. తన కెరీర్‌లో మొత్తం 6 డబుల్ గ్రాండ్‌స్లామ్‌లు వచ్చినా.. సానియా మహిళల డబుల్స్‌లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో చాలాసార్లు టైటిల్ గెలుచుకుంది. సానియా చివరిసారిగా 2016లో గ్రాండ్‌స్లామ్‌ గెలిచింది. ఆ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, సానియా మార్టినా హింగిస్‌తో కలిసి ఫైనల్‌లో ఆండ్రియా లవకోవా- లూసీ హ్రడెక్కాను ఓడించింది.