Sania Mirza: గ్రాండ్‌స్లామ్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న సానియామీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్‌గా తన లెజెండరీ గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది.

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 02:16 PM IST

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్‌గా తన లెజెండరీ గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది. సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓడిపోవడంతో శుక్రవారం తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణానికి ముగింపు పలికారు. విజయం సాధించిన బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ,రఫెల్ మాటోస్ జంటను సానియా మీర్జా అభినందించారు. అనంతరం తన టెన్నిస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ సానియా కన్నీళ్లు పెట్టుకున్నారు.

తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌లో ఆడుతున్న బ్రెజిల్‌కు చెందిన స్టెఫానీ, మాటోస్‌ల చేతిలో 7-6(2), 6-2తో సానియా, బోపన్న జోడీ ఓడింది. సానియా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఆమె ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. గంటపాటు జరిగిన ఫైనల్లో సానియా జోడి ఏ దశలోనూ ఫైట్ ఇవ్వలేకపోయింది. గతంలో మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్‌గా సానియా నిలిచారు. ఇక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ ముగించిన సానియా వచ్చే నెలలో జరగనున్న దుబాయ్‌ ఓపెన్‌లో ఆడనుంది. అదే తన ప్రొఫెషనల్ టెన్నిస్‌ కెరీర్‌కు ఆఖరి టోర్నమెంట్‌.

Also Read: Rashmika Mandanna: విజయ్ తో విహారయాత్రకు వెళ్తే తప్పేంటి?.. రష్మిక రియాక్షన్

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిపోయిన సానియా మీర్జా భావోద్వేగానికి గురైంది. “నా ప్రొఫెషనల్ కెరీర్ 2005లో మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కి వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు. టైటిల్ గెలిచినందుకు జోడీకి అభినందనలు.” అని తెలిపింది. సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్‌లో 6 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్‌గా నిలిచింది. డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 30కి చేరిన భారత్‌కు చెందిన ఏకైక టెన్నిస్ క్రీడాకారిణి ఆమె. ఆమె టెన్నిస్ కెరీర్‌లో డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ని రెండుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ని ఒకసారి, వింబుల్డన్‌ను ఒకసారి, యుఎస్ ఓపెన్‌ని రెండుసార్లు గెలుచుకోవడంలో ఆమె విజయం సాధించింది. లియాండర్ పేస్, మహేష్ భూపతి తర్వాత డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మూడవ భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా.