Site icon HashtagU Telugu

Sandeep Sharma: ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన సందీప్ శర్మ.. ఇంతకుముందు కూడా ఇలాగే!

Sandeep Sharma

Sandeep Sharma

Sandeep Sharma: బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 188 పరుగులు సాధించగా, రాజస్థాన్ రాయల్స్ కూడా గెలుపు దిశగా ఆడి మ్యాచ్‌ను టై చేయగలిగింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లో ఢిల్లీ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. 12 పరుగుల లక్ష్యాన్ని 4 బంతుల్లో సాధించి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ తరపున సూపర్ ఓవర్‌ను సందీప్ శర్మ (Sandeep Sharma) బౌల్ చేశాడు. అయితే అతనికి డిఫెండ్ చేయడానికి కేవలం 11 పరుగులు మాత్రమే లభించాయి.

సూపర్ ఓవర్‌కు ముందు ఢిల్లీ తరపున మిచెల్ స్టార్క్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ వేశాడు. ఇందులో రాజస్థాన్‌కు విజయం కోసం కేవలం 9 పరుగులు అవసరం. అతని అద్భుత బౌలింగ్‌తో స్కోరును సమం చేశాడు. సూపర్ ఓవర్‌ను కూడా స్టార్క్ వేశాడు. ఇందులో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. షిమ్రాన్ హెట్మయర్ 4 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రియాన్ పరాగ్ ఒక ఫోర్ కొట్టి రెండో బంతికి ఔట్ అయ్యాడు.

అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఓవర్‌లో 11 బంతులు వేశాడు. ఇది ఐపీఎల్‌లో ఒక బౌలర్ ఒక ఓవర్‌లో 11 బంతులు వేసిన నాల్గవ సందర్భం. ఈ ఓవర్‌లో అతను 4 వైడ్‌లు, 1 నో-బాల్ వేశాడు. ఈ ఓవర్ రాజస్థాన్ రాయల్స్‌కు చాలా ఖరీదైనదిగా మారింది.

Also Read: Cervical Pain: సెర్వైకల్ నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ వ్యాయమాలు మీకోసమే!

సందీప్ శర్మ పేరు అవమానకర జాబితాలో చేరింది

సందీప్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ ప్రారంభంలోనే అతను వైడ్‌తో మొదలుపెట్టాడు. డాట్ బాల్ వేసిన తర్వాత అతను మళ్లీ వరుసగా 3 బంతులు వైడ్‌గా వేశాడు. ఆ తర్వాత నో-బాల్ వేశాడు. ఆపై స్టబ్స్ తదుపరి బంతికి ఫోర్, సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో అతను మొత్తం 11 బంతులు వేశాడు. సందీప్ శర్మ ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన నాల్గవ బౌలర్‌గా అవాంఛనీయ రికార్డు సృష్టించాడు. అతనికి ముందు తుషార్ దేశ్‌పాండే, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఇలాంటి రికార్డు సృష్టించారు.