Maharaja Trophy T20 : జూ.ద్రవిడ్ కు ఫ్రాంచైజీ కాంట్రాక్ట్

అండర్ 19 కేటగిరీలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్న సమిత్ ఫ్రాంచైజీ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 11:00 PM IST

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid) కుమారుడు (Samit Dravid) దేశవాళీ క్రికెట్ లో దూసుకొస్తున్నాడు. అండర్ 19 కేటగిరీలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్న సమిత్ ఫ్రాంచైజీ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మహారాజా ట్రోఫీ (Maharaja Trophy T20) వేలంలో ద్రావిడ్ కుమారుడు 50 వేల ధర పలికాడు. గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ (Mysuru Warriors during) సమిత్ ను వేలంలో తీసుకుంది. ఈ టీమ్ కు భారత వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ కెప్టెన్ గా ఉన్నాడు. గత కొంత కాలంగా సమిత్ బంతితో పాటు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు.కర్ణాటక అండర్ 19 జట్టు 2023-24 కూచ్ బెహర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. లాంకషైర్ తో జరిగిన మూడురోజుల మ్యాచ్ లోనూ కర్ణాటక ఎలెవన్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించాడు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా మైసూరు వారియర్స్ టీమ్ లో ఆల్ రౌండర్లు కృష్ణప్ప గౌతమ్, జగదీశ్ సుచిత్ పాటు పేసర్ ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. ఇదిలా ఉంటే మహారాజా ట్రోఫీ వేలంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఎల్ఆర్ చేతన్ అత్యధిక ధర పలికాడు. బెంగళూరు బ్లాస్టర్స్ అతన్ని రూ. 8.2 లక్షలకు కొనుగోలు చేసింది.చేతన్ గత సీజన్ లో గుల్బర్గా టీమ్ కు ఆడాడు. ఆ సీజన్ లో 11 ఇన్నింగ్స్ లలో 309 పరుగులు చేశాడు. కాగా ఇదే వేలంలో స్పిన్ ఆల్ రౌండర్ శ్రేయాస్ గోపాల్ రెండో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు. మంగుళూరు డ్రాగన్స్ టీమ్ అతన్ని రూ.7.6 లక్షలకు కొనుగోలు చేసింది. మైసూరు వారియర్స్ కె.గౌతమ్ ను రూ.7.4 లక్షలకు, సుచిత్ ను రూ.4.8 లక్షలకు దక్కించుకుంది. ఇక ప్రవీణ్ దూబే రూ.6.8 లక్షలకు గుల్బర్గ టీమ్ తీసుకోగా… కెసి కరియప్పను రూ.4.2 లక్షలు హుబ్లి టైగర్స్ కొనుగోలు చేసింది. మొత్తం ఆరు జట్లు పోటీపడుతున్న మహారాజా ట్రోఫీ 2024 సీజన్ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

Read Also : Rashmika Mandanna దళపతి సాంగ్ కి రష్మిక స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..!

Follow us