Site icon HashtagU Telugu

Saina Nehwal: ఒలింపిక్స్‌ నుంచి సైనా అవుట్ ?

Saina Nehwal

New Web Story Copy 2023 09 13t174858.488

Saina Nehwal: పారిస్ ఒలింపిక్స్‌కు భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. ఆమె ఇప్పటికే గాయాలతో సతమతమవుతుంది. తాజాగా ఆమె ఫిట్నెస్ పై ఆసక్తికరంగా స్పందించింది. సైనా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ను విడిచిపెట్టే ఆలోచన లేదని చెప్పింది. ప్రస్తుతం మోకాలి సమస్యతో బాధపడుతున్నానని అన్నది. ఫిజియోలు నాకు సహాయం చేస్తున్నారు కానీ మంట తగ్గకపోతే, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. నేను కూడా అర్ధంతరంగా బరిలోకి దిగితే ప్రయోజనం ఉండదు. ఫలితాలు కూడా రావని అభిప్రాయపడింది. .ప్రస్తుతం సైనా నెహ్వాల్ ర్యాంకింగ్ ప్రపంచంలో 55వ స్థానానికి పడిపోయింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత సైనా చివరిసారిగా జనవరి 2019లో మలేషియా మాస్టర్స్‌లో టైటిల్ గెలుచుకుంది.

రిటైర్మెంట్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు… సైనా మాట్లాడుతూ.. అందరూ ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాలంటూ ఆసక్తికరంగా చెప్పింది. శరీరం సహకరించకపోతే ఎవరైనా ఇంటికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒక స్పోర్ట్స్ పర్సన్‌గా నేను ఆటను ప్రేమిస్తున్నాను అని తెలిపింది.2015-16లో భారత మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందిన సైనా తన ఫామ్‌ను తిరిగి పొందడానికి బెంగళూరులోని ప్రకాష్ పదుకొణె అకాడమీలో వారం పాటు శిక్షణ తీసుకోవాలనే పివి సింధు సూచనను ఆహ్వానించింది.

Also Read: MLC Kavitha: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కవిత, గాంధీ కుటుంబానికి సూటి ప్రశ్న