GT vs RCB: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. నిరాశపరిచిన గిల్

సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మిల్లర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

GT vs RCB: వరుస ఓటములతో ఇబ్బంది పడిన రాయల్ ఛాలెంజెర్స బెంగుళూరు గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. అదే జోరుతో ఈ రోజు గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. ఐపీఎల్ 45వ మ్యాచ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొంటోంది.

ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఆర్సీబీ ప్రతి మ్యాచ్ లోనూ గెలవాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 7 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. మరోవైపు ఈ సీజన్లో గుజరాత్ ప్రదర్శన కూడా పేలవంగా కొనసాగుతుంది. గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలుపొందగా, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టును సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ ఆదుకున్నారు. ఇద్దరు నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఈ మ్యాచ్ లోనూ కెప్టెన్ శుబ్ మన్ గిల్ నిరాశపరిచాడు. 19 బంతులు ఆడి ఫోర్ సహాయంతో 16 పరుగులతో వెనుదిరిగాడు. షారుక్ ఖాన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 58 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అద్భుతంగ ఆడాడు. ఒక ఎండ్ లో సాయి సుదర్శన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతుండగా, సాయికి మిల్లర్ మంచి సహకారం అందించడంతో జట్టు స్కోరు 200 కు చేరుకుంది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మిల్లర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

We’re now on WhatsAppClick to Join

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, విల్ జాక్వెస్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, స్వప్రిల్ సింగ్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, ఉమ్‌జై, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

Also Read: Sonali Bendre: క్యాన్సర్ అని తెలియగానే నా గుండె పగిలింది: సోనాలి బింద్రే