India Wins: సాఫ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం (India Wins) సాధించింది. దింతో భారత జట్టు 9వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత జట్టు 5-4తో కువైట్‌ను ఓడించింది. అంతకుముందు, రెండు జట్లు నిర్ణీత సమయానికి 1-1తో సమంగా ఉన్నాయి. ఆ తర్వాత మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. కానీ అదనపు సమయంలో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. అనంతరం పెనాల్టీ షూటౌట్ ద్వారా మ్యాచ్‌ని నిర్ణయించారు.
పెనాల్టీ షూటౌట్‌లో టీమిండియా తరఫున కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు మహేష్ సింగ్, సుభాసిష్ బోస్, లాలియాంజుల చాంగ్టే, సందేశ్ జింగాన్ గోల్స్ చేశారు. అయితే పెనాల్టీ షూటౌట్‌లో దంతా సింగ్ పెనాల్టీ షూటౌట్‌లో గోల్ మిస్ అయ్యాడు. అయితే, భారత విజయం తర్వాత కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సునీల్ ఛెత్రి మొత్తం ఈ టోర్నీలో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు.
Hero Tri-Nation Cup ✅
Hero Intercontinental Cup ✅
Bangabandhu SAFF Championship ✅Hat-trick of championships for 🇮🇳 🤩#KUWIND ⚔️ #IndianFootball ⚽️ pic.twitter.com/AaXq26vXik
— Indian Football Team (@IndianFootball) July 4, 2023
సాఫ్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్లో కువైట్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. భారత్ ఈ టైటిల్‌ను తొమ్మిదోసారి గెలుచుకుంది. ఇంతకుముందు భారత్ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లో ఛాంపియన్‌గా నిలిచింది. 14 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్ తొమ్మిది సార్లు చాంపియన్‌గా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 5-4తో కువైట్‌పై విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియంలో నిర్ణీత 90 నిమిషాల పాటు ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 30 నిమిషాల అదనపు సమయంలో కూడా ఏ జట్టూ రెండో గోల్ చేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెనాల్టీ షూటౌట్‌లో మ్యాచ్ ఖరారైంది.
గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు. పెనాల్టీ షూటౌట్‌లో అతను అద్భుతం చేశాడు. కువైట్ కెప్టెన్ ఖలీద్ అల్ ఇబ్రహీం చివరి షాట్‌ను గోల్ కాకుండా ఆపాడు. పెనాల్టీ షూటౌట్‌లో రెండు జట్లకు ఐదు గోల్స్ చేయడానికి ఐదు అవకాశాలు లభిస్తాయి. ఇందులో తక్కువ గోల్స్ చేసిన జట్టు ఓడిపోతుంది. నిర్ణీత ఐదు షాట్ల తర్వాత ఇరు జట్లు చెరో నాలుగు చొప్పున సమంగా నిలిచాయి. అయితే నౌరెమ్ మహేష్ సింగ్ భారత్ తరఫున గోల్ చేశాడు. అదే సమయంలో కువైట్ కెప్టెన్ ఖలీద్ కొట్టిన షాట్‌ను భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ ఆపేశాడు. దింతో టీమ్ ఇండియా విజేతగా నిలిచింది.