ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఒక ఎవరెస్ట్.. 16 ఏళ్ళకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డులకు చిరునామాగా మారిపోయాడు. సుధీర్ఘ కెరీర్‌లో మాస్టర్ అందుకోని రికార్డులు లేవు.. చేరుకోని మైలురాళ్ళు లేవు.. సాధించని ఘనతలు లేవు..అందుకోని గౌరవాలు కూడా లేవు.. భారత్‌లో చాలా మంది యువక్రికెటర్లకు సచినే స్ఫూర్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి భారత క్రికెట్ దిగ్గజానితి అరుదైన గౌరవం దక్కనుంది. ముంబై వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. సచిన్ (Sachin Tendulkar) 50వ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 23న ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ ఆ సమయానికి సాధ్యం కాకుండే వన్డే ప్రపంచకప్ జరిగే సమయంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశముంది. ఇక్కడే సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. టెండూల్కర్ ఇదే గ్రౌండ్‌లో కెరీర్ ప్రారంభించాడు. అలాగే కెరీర్ చివరి మ్యాచ్‌నూ వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) నే ఆడాడు.
అటు వన్డే ప్రపంచకప్ గెలిచింది కూడా ఇదే స్టేడియంలో.. వాంఖేడేతో సచిన్‌కు ఇలాంటివి ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. అందుకే వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) నే క్రికెట్ దిగ్గజం ఏర్పాటు చేయనుంది ఎంసీసీ. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా స్టేడియంలో విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది దానిపై సచిన్‌తోనే ఎంసిఎ చర్చించింది. మూడు వారాల క్రితమే దీనిపై సచిన్‌తో మాట్లాడామని, ఆయన అనుమతించిన తర్వాత సన్నాహాలు మొదలుపెట్టినట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలే చెప్పారు. క్రికెట్‌కు టెండూల్కర్ చేసిన సేవకు గుర్తుగా ముంబై క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న చిన్న కార్యక్రమంగా అభివర్ణించారు. ఇదిలా ఉంటే స్టేడియంలో ఎక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలనే దానిపై సచిన్‌ను ఎంసిఎ ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీని కోసం మంగళవారం సచిన్ వాంఖేడే స్టేడియాన్ని (Wankhede Stadium) సందర్శించాడు. కాగా తన కెరీర్ ప్రారంభమైన స్టేడియంలో విగ్రహం ఏర్పాటు తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు సచిన్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందు కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కోచింగ్‌లో తాను వాంఖేడేలోనే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు.
Also Read: March 2023 Horoscope: మార్చిలో 2 రాశుల వారికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు