Site icon HashtagU Telugu

Virat Kohli Stats: వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉందంటే..?

Virat Kohli Stats

Compressjpeg.online 1280x720 Image (2) 11zon

Virat Kohli Stats: వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ (Virat Kohli Stats) చాలా దగ్గరగా ఉన్నాడు. అయితే ప్రపంచ కప్ గణాంకాలలో కోహ్లీ.. మాస్టర్-బ్లాస్టర్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ ఇద్దరు దిగ్గజాల ప్రపంచకప్ గణాంకాల్లో చాలా గ్యాప్ ఉంది. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. సచిన్ 1992 నుంచి 2011 వరకు మొత్తం 6 ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ సమయంలో సచిన్ 45 మ్యాచ్‌లలో 56.95 బ్యాటింగ్ సగటుతో 2278 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో సచిన్ స్ట్రైక్ రేట్ కూడా 89గా ఉంది. దీంతో సచిన్ ప్రపంచకప్‌లో మొత్తం 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేయడంలోనూ టెండూల్కర్ నంబర్‌వన్‌గా ఉన్నాడు.

మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు విరాట్ కోహ్లీ. అతను సచిన్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2011 నుంచి 2019 మధ్య మొత్తం మూడు ప్రపంచ కప్‌లు ఆడాడు. ఈ సమయంలో విరాట్ 26 మ్యాచ్‌ల్లో 1030 పరుగులు చేశాడు. అంటే సచిన్ కంటే ఇంకా 1248 పరుగులు వెనుకబడి ఉన్నాడు. సచిన్ ని అధిగమించాలంటే కింగ్ కోహ్లీ తదుపరి ప్రపంచకప్‌ను కూడా ఆడాల్సి ఉంటుంది.

Also Read: Yashasvi Jaiswal: ఆసియా క్రీడలలో యశస్వి జైస్వాల్ సెంచరీ.. 48 బంతుల్లోనే 100 పరుగులు..!

We’re now on WhatsApp. Click to Join

బ్యాటింగ్ యావరేజ్, స్ట్రైక్ రేట్ పరంగా కూడా కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ కంటే వెనుకబడ్డాడు. ప్రపంచకప్‌లో కోహ్లీ బ్యాటింగ్ సగటు 46.81 కాగా స్ట్రైక్ రేట్ 86.70గా ఉంది. సెంచరీలు, హాఫ్ సెంచరీల విషయంలో విరాట్ చాలా వెనుకబడ్డాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కేవలం రెండు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు (18426), అత్యధిక సెంచరీలు (51) చేసిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. విరాట్ కోహ్లీ ఖాతాలో ఇప్పటివరకు 13083 పరుగులు, 47 సెంచరీలు ఉన్నాయి. అయితే బ్యాటింగ్ యావరేజ్, స్ట్రైక్ రేట్‌లో విరాట్ గణాంకాలు సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాయి.