Site icon HashtagU Telugu

Happy B’day Sachin: హ్యాపీ బర్త్ డే క్రికెట్ గాడ్

Players Played For The Country

Players Played For The Country

భారత్ లో క్రికెట్ ఒక మతమయితే…సచిన్ దేవుడు… ఇది ఫాన్స్ మాట

నేను క్రికెట్ లో దేవుడిని చూసాను…ఆ దేవుడు భారత్ టెస్ట్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు…
సచిన్ గురించి ఆసీస్ మాజీ క్రికెటర్లు హేడెన్ వ్యాఖ్య ఇది.

మీరు సచిన్ ను ఔట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే చేతి కర్రతో కూడా బ్యాటింగ్ చేయగల ఆటగాడు సచిన్… ఇదీ క్రికెట్ దేవుడుగా ఫాన్స్ పిలుచుకునే టెండూల్కర్ గురించి పలువురు మాజీ ఆటగాళ్ళు చెప్పిన అభిప్రాయాలు. వరల్డ్ క్రికెట్ లో రారాజు…రికార్డులకు చిరునామా…క్రికెట్ ఎవరెస్ట్ గా పేరు తెచ్చుకున్న సచిన్ ఇవాళ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం..

సచిన్‌.. సచిన్‌.. ఈ పేరు మారుమోగని క్రికెట్ మైదానం ఈ ప్రపంచంలో దాదాపు ఉండదేమో అంటే అతిశయోక్తి కాదు. సచిన్‌ అడుగుపెట్టని మైదానం లేదు. పరుగులు చేయని పిచ్‌ లేదు. రికార్డు సృష్టించని దేశం లేదు. అసలు సచిన్‌ లేని క్రికెట్‌ ప్రపంచమే లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీల సెంచరీని పూర్తి చేసినా.. టన్నుల కొద్ది పరుగులు చేసినా అతడికే సాధ్యమైంది. గేల్, సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ లాంటి చిచ్చర పిడుగులు ఉన్నా వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని కొట్టింది సచినే.ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు.
ఆడిన తొలి మ్యాచ్ లో డకౌట్ అయిన ఈ క్రికెట్ దేవుడు తర్వాత ప్రపంచ క్రికెట్ ను శాసించాడు.

1973 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ మరాఠి నవలా రచయిత రమేశ్‌ తెందూల్కర్‌ ఇంట్లో జన్మించారు సచిన్‌. లెజెండరీ సంగీత విధ్వాంసుడైన సచిన్‌ దేవ్‌ బర్మన్‌కు సచిన్‌ వాళ్ల నాన్న వీరాభిమాని. అందుకే తన కొడుక్కి సచిన్‌ అనే పేరు పెట్టారు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అడుగుపెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా తన సుధీర్ఘ క్రికెట్‌ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు.

వన్డే రికార్డులు :
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు)
అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్. (463 వన్డేలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (15 సార్లు)
అతిపిన్న వయస్సులో (16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18426 పరుగులు)
10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 17000, 18000 పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడు.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 7 సార్లు సాధించాడు.
ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)
రాహుల్ ద్రవిడ్తో కలిసి అత్యధిక పరుగుల పార్టనర్ షిప్ రికార్డు. (331 పరుగులు )
సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పార్టనర్ షిప్ రికార్డు. (6609)
అత్యధిక సార్లు 200 మించి పార్టనర్ షిప్ పరుగులు. (6 సార్లు)
వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు.
2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.

టెస్ట్ రికార్డులు :
పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు.
టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (67అర్థ సెంచరీలు)
20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.
అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (200 టెస్టులు)
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (15921)
అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)
12000, 13000, 14000, 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్.
విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌.

1990 ఏప్రిల్ నుంచి 1998 ఏప్రిల్ వరకు విరామం లేకుండా 239 మ్యాచ్ లు ఆడి రికార్డ్ సృష్టించిన ఏకైక ఆటగాడు.

Exit mobile version