Sachin’s IPL XI: సచిన్ ఐపీఎల్ 2022 ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ ముగియడంతో చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ సీజన్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ఆటగాళ్లతో 11 మందితో కూడిన జట్టును ప్రకటిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 31, 2022 / 01:08 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ ముగియడంతో చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ సీజన్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ఆటగాళ్లతో 11 మందితో కూడిన జట్టును ప్రకటిస్తున్నారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. తన జట్టును ప్రకటించాడు. సచిన్ తన జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో హార్దిక్ స్టాండౌట్ కెప్టెన్ అని కితాబిచ్చాడు.అటు ఓపెనర్లుగా బట్లర్, శిఖర్ ధావన్‌కు స్థానం కల్పించారు. వారి లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్‌ బాగుంటుందని, ధావన్ లాంటి అనుభవజ్ఞుడు ఎంతో ఉపయోగపడతాడని తెలిపాడు. బట్లర్ ఇప్పటికే అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకోగా.. శిఖర్ ధావన్ 14 మ్యాచ్‌ల్లో 460 పరుగులతో ఆకట్టుకున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో ఎంపిక చేసిన సచిన్ సింగిల్స్ తీయడమే కాకుండా.. సిక్సర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టగలిగే అతికొద్దమంది బ్యాటర్లలో అతడు ఒకడని ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యను నాలుగో స్థానంలోనూ, డేవిడ్ మిల్లర్ ను ఐదో స్థానానికి ప్రతిపాదించాడు. మిల్లర్ ఉండటం వల్ల లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ లాభిస్తుందని చెప్పాడు. మిల్లర్ తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్ చోటు ఇచ్చిన సచిన్ దినేశ్ కార్తీక్‌ ను వికెట్ కీపర్‌గానూ తీసుకున్నారు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్, యజువేంద్ర చాహల్ లకు చోటు కల్పించాడు. ఇక పేస్ విభాగంలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశాడు.
ఈ సీజన్‌లో ఆటగాళ్లు చేసిన ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశానని సచిన్ చెప్పాడు.

సచిన్ ఐపీఎల్ 2022 బెస్ట్ XI :
జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేశ్ కార్తీక్, రషీద్ ఖాన్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్.