Site icon HashtagU Telugu

Golden Ticket: సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్‌

Golden Ticket

Compressjpeg.online 1280x720 Image (4) 11zon

Golden Ticket: ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని ఐకాన్స్ కు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని బోర్డు ప్లాన్ చేసింది. దీనికి ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ (Golden Ticket) అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా తొలి గోల్డెన్ టిక్కెట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు అందించారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ టికెట్‌ ఇచ్చారు.

BCCI ట్విట్టర్ లో ఈ పోస్ట్‌ను భాగస్వామ్యం చేశారు. ఇందులో సచిన్‌తో కలిసి జై షా కనిపించాడు. సచిన్‌కి జై షా గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. దేశం, క్రికెట్ కోసం ప్రత్యేక క్షణం అనే క్యాప్షన్‌లో బీసీసీఐ రాసింది. గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ ప్రోగ్రామ్ కింద జై షా.. సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టిక్కెట్‌ను అందించారు.

Also Read: MS Dhoni With Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ధోనీ.. గోల్ఫ్‌ ఆడిన వీడియో వైరల్..!

గతంలో అమితాబ్ బచ్చన్‌కు కూడా బీసీసీఐ గోల్డెన్ టికెట్ ఇచ్చింది. ప్రపంచ కప్ 2023 భారతదేశంలో నిర్వహించబడుతుంది. అక్టోబర్ 5న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. టోర్నీ చివరి మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.

ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.