Virat Kohli 50th Century : కోహ్లీ సెంచరీ ఫై సచిన్..మోడీ రియాక్షన్

తన శిష్యుడు తన సమక్షంలోనే తన రికార్డును బ్రేక్ చేయడం సచిన్ ను ఎంతో సంతోషానికి గురి చేసేలా చేసింది

  • Written By:
  • Updated On - November 16, 2023 / 11:13 PM IST

విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డుని క్రియేట్ చేసి చ‌రిత్ర (Virat Kohli Hits Record-breaking 50th ODI Century )సృష్టించారు. ప్రపంచ వ‌న్డే చరిత్రలో అత్యధిక రికార్డులను సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్నటి వరకు ఈ రికార్డు సచిన్ (Sachin Tendulkar) పేరు మీద ఉండే..ఇప్పుడు సచిన్ ను పక్కకు జరిపి..ఆ స్థానంలో కోహ్లీ నిలిచాడు. వ‌న్డే వరల్డ్ కప్ (2023 World Cup) లో భాగంగా నేడు ముంబైలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌, భారత్ మధ్య సెమీ ఫైనల్ (India vs New Zealand Semi Final) మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించి సచిన్ రికార్డు ను బ్రేక్ చేసాడు.

నవంబర్ 5న కోహ్లీ (Virat Kohli Birthday) పుట్టినరోజున జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేసి సచిన్ రికార్డుని ఈక్వల్ చేశారు. నేడు జరిగిన మ్యాచ్ లో మరో సెంచరీ చేసి సచిన్ దాటి విరాట్ కొత్త రికార్డుని సృష్టించారు. ఈ రికార్డుతో అభిమానులు, క్రికెట్ వీక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే స్టేడియంలో ఉన్న సచిన్ కూడా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సచిన్ సొంతగడ్డ మీద, క్రికెట్ దేవుడి సమక్షంలోనే విరాట్ ఈ రికార్డును అధిగమించడం విశేషం. తన శిష్యుడు తన సమక్షంలోనే తన రికార్డును బ్రేక్ చేయడం సచిన్ ను ఎంతో సంతోషానికి గురి చేసేలా చేసింది. విరాట్ సెంచరీ పూర్తికాగానే పైకి లేచి మరీ.. సచిన్ చప్పట్లు కొట్టాడు విరాట్ కోహ్లి సైతం గ్రౌండ్లో నుంచే సచిన్‌కు పాదాభివందనం చేసి గురువు పట్ల కృతజ్ఞత తెలియజేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా సచిన్ (Sachin Tendulkar Emotional Tweet) ఎమోషనల్ ట్వీట్ చేసాడు. విరాట్ కోహ్లి కెరీర్ తొలినాళ్లలో డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విరాట్ కోహ్లిని తొలిసారి డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు ఏం జరిగిందో గుర్తుచేసుకున్నాడు. “ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారిగా నేను నిన్ను కలిసినప్పుడు.. నా కాళ్లను తాకాలంటూ మిగతా ప్లేయర్లను నిన్ను ఆటపట్టించారు. ఆ సందర్భంలో నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ కొద్దిరోజుల్లోనే నువ్వు నీ ఆటతీరు, నైపుణ్యంతో నా మనసును తాకావు. అప్పటి ఆ కుర్రాడు.. ఇప్పటి విరాట్‌గా ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడు నా రికార్డు అధిగమించినందుకు మాత్రమే నేను సంతోషించడం లేదు. ప్రపంచకప్ సెమీఫైనల్ లాంటి పెద్దవేదిక మీద, నా సొంత మైదానంలో ఇది జరగడం నాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది”.. అంటూ సచిన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

అలాగే ప్రధాని మోడీ సైతం కోహ్లీ సెంచరీ ఫై స్పందించారు. ”విరాట్ కోహ్లీ తన 50 సెంచరీని సాధించమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి నిర్వచించే పట్టుదలకు ఉదాహరణగా నిలిచారు. ఈ అద్బుతమైన మైలురాయి, అతని నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం. నేను అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అతను భవిష్యత్ తరాలకు బెంచ్‌మార్క్ సెట్ చేస్తూనే ఉన్నాడు” అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఇక విరాట్ భార్య అనుష్క సైతం కోహ్లీ సెంచరీ చేయగానే ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ కోహ్లిని అభినందించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Virat Kohli@50: వన్డేల్లో కోహ్లీ 50వ సెంచరీ, క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్ధలు!