Site icon HashtagU Telugu

Sachin Tendulkar: వింబుల్డన్ టైటిల్ విన్నర్ కార్లోస్ అల్కారాజ్‌పై ప్రశంసలు కురిపించిన మాస్టర్‌ బ్లాస్ట‌ర్ సచిన్..!

Sachin Tendulkar

Resizeimagesize (1280 X 720) (1) 11zon

Sachin Tendulkar: వింబుల్డన్ 2023 ఫైనల్లో నొవాక్ జకోవిచ్‌ను ఓడించిన కార్లోస్ అల్కారాజ్‌ (Carlos Alcaraz)పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టెన్నిస్ ఆటగాళ్లతోపాటు, పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా 20 ఏళ్ల స్పెయిన్ క్రీడాకారుడి సామర్థ్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు కూడా చేరింది. సచిన్.. అల్కారాజ్‌ను రోజర్ ఫెదరర్‌తో పోల్చాడు.

అల్కారాజ్‌ను ఫెదరర్‌తో పోల్చిన సచిన్‌

కార్లోస్ అల్కారాజ్ వింబుల్డన్ 2023 టైటిల్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేసి యువకుడిపై ప్రశంసలు కురిపించారు. సచిన్ ఇలా రాసుకొచ్చాడు. “చూడడానికి ఎంత అద్భుతమైన ఫైనల్. ఇద్దరు ఆటగాళ్ల నుండి అద్భుతమైన ప్రదర్శన. మేము రాబోయే టెన్నిస్ సూపర్ స్టార్ ఎదుగుదలను చూస్తున్నాము. నేను రోజర్‌ ఫెదరర్ ను అనుసరించినట్లే రాబోయే 10-12 సంవత్సరాలు కార్లోస్‌ను అనుసరిస్తాను”అన్నారు.

Also Read: Major League Cricket: అమెరికాలో చెన్నై ఆటగాడి కళ్ళు చెదిరే భారీ సిక్సర్

ఫైనల్ మ్యాచ్ ఐదు సెట్ల పాటు సాగింది

నొవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కారాజ్ మధ్య జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ ఐదు సెట్ల పాటు సాగింది. అయితే, చివరికి అల్కారాజ్ గెలిచాడు. అతను 1–6, 7–6, 6–1, 3–6, 6–4తో జొకోవిచ్‌ను ఓడించి తన మొదటి వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. కార్లోస్ అల్కారాజ్ వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న మూడవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు.

20 సంవత్సరాల వయస్సులో అల్కారాజ్ US ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఆఖరి మ్యాచ్‌లో 16 ఏళ్ల జొకోవిచ్‌కు స్పెయిన్‌ ఆటగాడు గట్టిపోటీనిచ్చి ఏడుసార్లు చాంపియన్‌ను చిత్తు చేశాడు. కార్లోస్ అల్కారాజ్ 2002 తర్వాత వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఆటగాడు. నోవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రేల జాబితాలో చేరాడు. గత 20 ఏళ్లలో ఈ నలుగురు ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌ను శాసిస్తున్నారు. దీనిని అల్కారాజ్ ముగించారు.