Ind vs Eng : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ కావడంతో ఈ పోటీకి ప్రత్యేకత పెరిగింది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు, శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ESPN Cricinfo ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారత్ ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుస్తుందని నాకు నమ్మకంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనలో టీమ్‌కు కీలక బౌలర్ అవుతాడు. బుమ్రా చుట్టూ మన బౌలింగ్ దళం తిరుగుతుంది’’ అని పేర్కొన్నాడు.
బుమ్రా పనితీరు మాత్రమే కాకుండా, అతడికి తోడుగా బౌలింగ్ లైనప్ ఎలా స్పందిస్తుందన్నదానిపైనా విజయం ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్‌లో ఉన్నాడని, అలాగే అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా లాంటి వారు మంచి సహాయక పాత్ర పోషిస్తారని తెలిపారు.
స్పిన్నర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి అనుభవజ్ఞులుండటం టీమ్‌కి బలాన్నిచ్చే అంశమని టెండూల్కర్ పేర్కొన్నారు. ఆఖరిగా, భారత్ సమతుల్యమైన బౌలింగ్ దళంతో మంచి ప్రదర్శన ఇస్తుందన్న నమ్మకం తనదని తెలిపారు.
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు