Site icon HashtagU Telugu

Sachin Das : మరో సంచలనం సచిన్ దాస్.. ఎవరీ ప్లేయర్ ? బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి ?

Sachin Das

Sachin Das

Sachin Das : సచిన్ దాస్.. ఇప్పుడీ పేరు ఇండియన్ క్రికెట్‌‌లో ట్రెండ్ అవుతోంది.  మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో 2005 ఫిబ్రవరి 3న జన్మించిన ఈ యువతేజం పేరు అంతటా మార్మోగుతోంది. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు వీరాభిమానిగా పేరొందిన సంజయ్ దాస్ కొడుకే ఈ సచిన్ దాస్. సచిన్‌పై ఉన్న వీరాభిమానంతోనే తన కొడుకుకు సచిన్ దాస్ అనే పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ సచిన్‌దాస్ సాధించిన అఛీవ్‌మెంట్స్ ఏమిటి ? టెండూల్కర్‌‌లాగే జెర్సీ నంబర్ 10 ధరించి బ్యాటింగ్‌కు దిగే సచిన్ దాస్ భారత క్రికెట్ ప్రియులు మెచ్చేలా ఏం చేశాడు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. దీంతో వరుసగా ఐదోసారి, మొత్తం మీద తొమ్మిదోసారి అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన దేశంగా భారత్ రికార్డును క్రియేట్ చేసింది.   ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఇండియా ఢీకొననుంది. ఎలాగైనా ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించి..  ఆస్ట్రేలియా సీనియర్ క్రికెట్ టీమ్ చేతిలో ఇండియా సీనియర్ క్రికెట్ జట్టుకు ఎదురైన ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భారత అభిమానులంతా భావిస్తున్నారు. ఇంతకీ అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్‌లో సచిన్ దాస్(Sachin Das) ఏం చేశాడో ఇక చూద్దాం..

Also Read : National Creators Awards : కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. కేంద్ర సర్కారు అవార్డులు

సౌతాఫ్రికాతో సెమీస్ వరకు ఈ టోర్నీలో భారత్‌ సులువుగానే విజయాలు సాధించింది. లీగ్ దశలో 200 పరుగులకుపైగా తేడాతో గెలవడం విశేషం. అయితే దక్షిణాఫ్రికా మాత్రం సెమీస్‌లో పెద్ద సవాలే విసిరింది. ఛేజింగ్‌లో ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా కెప్టెన్ ఉదయ్ సహరన్‌తో కలిసి సచిన్ దాస్ ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించాడు. దీంతో భారత్ 245 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులుండగానే ఛేదించింది. ఇక్కడే సచిన్ దాస్ అనే పేరు మార్మోగిపోయింది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అదీ నాకౌట్ దశలో.. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగుల వరద పారించాడు. 95 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 96 పరుగులు చేశాడు. వేగంగా బ్యాటింగ్ చేసి కెప్టెన్‌పై ఒత్తిడి తగ్గించడం సహా ముందున్న భారీ లక్ష్యాన్ని కరిగించుకుంటూ వెళ్లాడు. దీంతో భారత్‌ను ఫైనల్ చేర్చాడు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా దాస్ పేరే వినిపిస్తోంది.

సచిన్ దాస్ కోసం తండ్రి సంజయ్ దాస్ ఎంత కష్టపడ్డారో తెలుసా ?

సచిన్ దాస్ తండ్రి సంజయ్ దాస్ కూడా యూనివర్సిటీ స్థాయి వరకు క్రికెట్ ఆడాడు. అయితే జాతీయ జట్టుకు అతడు ఆడలేకపోయాడు. దీంతో తన కొడుకు రూపంలో ఆ కలను సాకారం చేయాలనుకున్నాడు. విశేషం ఏంటంటే.. సచిన్ దాస్ పుట్టకముందే అతడ్ని క్రికెటర్ చేయాలని నిర్ణయించుకున్నాడట సంజయ్. సచిన్ దాస్ పుట్టాక.. సంజయ్ దగ్గరుండి అతడికి ట్రైనింగ్ ఇప్పించాడు. తన కొడుకు కోసం అప్పు చేసి మరీ టర్ఫ్ వికెట్ రూపొందించాడు. పిచ్‌కు నీరు పట్టేందుకు 2,3 రోజులకు ఓసారి వాటర్ ట్యాంకర్‌ను రప్పించాల్సి వచ్చేది. దాస్ క్రికెట్ మెళుకువలు నేర్చుకోవడంలో అతడి చిన్ననాటి కోచ్ అజార్ కృషి కూడా ఉందని సంజయ్ దాస్ చెప్పాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కొల్హాపూర్ టస్కర్స్ తరఫున రాణించి సచిన్ దాస్ వెలుగులోకి వచ్చాడు . వేగంగా బ్యాటింగ్ చేయడం, భారీ సిక్సర్లు బాదడం ఇతడి ప్రత్యేకత.

Exit mobile version