South Africa vs Netherlands: T20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.!

T20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Cropped

Cropped

T20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్‌కప్‌ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించనుంది. టీ20 వరల్డ్‌కప్‌ లో నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పసికూన జట్టు అయిన నెదర్లాండ్స్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అయితే 159 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికాపై 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది.

ఈ ఫలితంతో టీమిండియాకు ఖరారైన సెమీస్‌ బెర్త్‌ ఫైనల్‌ అయింది. అటు టీ20 వరల్డ్‌కప్‌ నుంచి సౌతాఫ్రికా వైదొలిగింది. నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిచిందంటే దక్షిణాఫ్రికా టోర్నీ నుంచే నిష్క్రమించాల్సి ఉంటుంది.

ఈరోజు సూపర్-12 దశ చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను రోహిత్‌ సేన ఢీకొనబోతోంది. మామూలుగా అయితే జింబాబ్వేతో మ్యాచ్‌ అంటే ఫలితం గురించి ఎలాంటి ఆందోళనా ఉండదు. కానీ ఈ ప్రపంచకప్‌లో చిన్న జట్లు పెద్ద జట్లకు ఇచ్చిన షాక్‌లు చూశాక.. టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈమ్యాచ్‌లో జింబాబ్వేను ఓడిస్తే భారత్ సెమీస్‌కు చేరుతుంది.

  Last Updated: 06 Nov 2022, 10:06 AM IST