Site icon HashtagU Telugu

Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 57 బంతులు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. అదే సమయంలో టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా సంచలన ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 126 పరుగులు చేశాడు.

మరోవైపు ఈ సెంచరీతో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. రుతురాజ్ కంటే ముంద సురేశ్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, యశస్విజైస్వాల్, శుభ్‌మన్ గిల్, హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 క్రికెట్‌లో సెంచరీలు సాధించారు. టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు నాలుగు సెంచరీలు చేయగా, సూర్యకుమార్ యాదవ్ మూడు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. అతను స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు సాధించగా… సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా సెంచరీ చేశారు.

Also Read: IND vs AUS 3rd T20: మాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. మూడో టీ ట్వంటీలో ఆసీస్ విజయం