Site icon HashtagU Telugu

Ruturaj Gaikwad: ఆర్సీబీపై సీఎస్కే ఓట‌మి.. గైక్వాడ్ ఏమ‌న్నాడంటే..?

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad: IPL సీజన్ 2024లో 68వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. అదే లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో RCB జట్టు ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అయితే CSK ఈ ఓటమితో IPL నుండి నిష్క్రమించవలసి వచ్చింది. ఆర్‌సీబీపై పరాజయం తర్వాత చెన్నై కెప్టెన్ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) ఓ ప్రకటన చేశాడు.

రితురాజ్ గైక్వాడ్ ఏమన్నాడంటే?

ఆర్సీబీపై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ఇది మాకు చాలా నిరాశాజనకమైన ఓటమి. 200 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అన్నాడు. మ్యాచ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాం. దీంతో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి మాకు మ‌రో ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్లు అవసరం. కానీ అవి సాధ్యం కాలేదు. గత సంవత్సరం ఫైనల్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ సీజన్‌లో మేము ఆశించిన‌ట్లు జ‌ర‌గ‌లేద‌ని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఈ సంవత్సరం జ‌ట్టు ఆటగాళ్లు చాలా మంది గాయపడ్డారు. అనుభ‌వం ఉన్న ఆట‌గాళ్లు జ‌ట్టులో లేక‌పోవ‌డంతో ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమయ్యామని తెలిపాడు.

Also Read: TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు

సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి మహేంద్ర సింగ్ ధోని స్థానంలో రితురాజ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత తొలి దశలో జట్టు ప్రదర్శన బాగానే ఉంది. ఆ త‌ర్వాత రాణించ‌లేక‌పోయింది. ఈ సీజన్‌లో CSK జట్టు 14 మ్యాచ్‌లలో 7 గెలిచింది. మ‌రో 7 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే RCBతో జరిగిన మ్యాచ్‌లో CSK కనీసం 201 పరుగులను చేయాల్సి ఉంది. కానీ CSK జట్టు 191 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీని కారణంగా ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join