Ruturaj Gaikwad: టీ20ల ముంగిట భారత్ కు షాక్.. గాయం కారణంగా ఓపెనర్ గైక్వాడ్ టీ20లకు దూరం

న్యూజిలాండ్​తో మూడు టీ20ల సిరీస్ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మణికట్టు గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ తెలిపింది.

  • Written By:
  • Publish Date - January 25, 2023 / 10:15 AM IST

న్యూజిలాండ్​తో మూడు టీ20ల సిరీస్ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మణికట్టు గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ తెలిపింది. రుతురాజ్ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. రుతురాజ్ గాయం తీవ్రత గురించి తెలియరాలేదు.

న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల (IND vs NZ) టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20 తుది జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరగనుంది. ఇటీవల గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన కుడి మణికట్టులో నొప్పిగా ఉందని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వైద్య బృందానికి చెప్పాడు. దీని కారణంగా అతను తదుపరి వైద్య సలహా, చికిత్స కోసం NCAకి పంపబడ్డాడు. జూలైలో కూడా గైక్వాడ్ మణికట్టు గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. గైక్వాడ్ ఇటీవలి ఫామ్ అద్భుతంగా ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు సాధించాడు.

Also Read: More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు

రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడలేకపోతే, పృథ్వీ షా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం ఉంది. పృథ్వీ షా చివరిసారిగా గత ఏడాది జూలైలో శ్రీలంకతో టీ20 ఆడాడు. వెన్ను గాయం కారణంగా భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా NCAలో శిక్షణ పొందుతున్నాడు. ఈ కారణంగా అయ్యర్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రజత్ పాటిదార్‌కు అవకాశం లభించింది. అయితే ఫిట్‌నెస్‌కు లోబడి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే తొలి రెండు టెస్టుల కోసం అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు.