Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్‌ గైక్వాడ్‌

2024-2025 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-2017లో మహారాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad: శ్రీలంక టూర్​లో భాగంగా టీ20, వన్డేలకు సెలక్టర్లు ప్లేయర్లను ఎంపిక చేశారు. అయితే జట్టు కూర్పు పట్ల పలువురు క్రీడాభిమానులు, మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ లాంటి ప్లేయర్లను పక్కనబెట్టడం సరైనది కాదంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. రేపటి నుంచి భారత్ శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు ఋతురాజ్ ని సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు గైక్వాడ్ కు అండగా నిలిచారు. బీసీసీఐ మరియు సెలక్షన్ కమిటీని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై గైక్వాడ్ సైలెంట్ గా ఉండటం చూశాం. ఇక టీమిండియాకు ఈ యంగ్ స్టార్ ని సెలెక్ట్ చేయకపోవడంతో రంజీలో ఆడేందుకు సిద్దమయ్యాడు.

2024-2025 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-2017లో మహారాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 6 సెంచరీలతో 2,041 పరుగులు సాధించగా, 77 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 14 సెంచరీలతో 4130 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గత 5 సంవత్సరాలుగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అయినప్పటికీ భారత జట్టులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. తన కెప్టెన్సీలో 2023 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం సాధించిన గైక్వాడ్ 2021లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 6 వన్డేలు 115, 22 టి20 లలో 633 పరుగులు చేశాడు, ఇందులో 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు చేశాడు.అయితే రంజీలో సత్తా చాటి బీసీసీఐపై రివేంజ్ తీర్చుకోవాలని రుతురాజ్ కి పలువురు సూచిస్తున్నారు.రంజీలో రుతురాజ్ అంచనాలు అందుకుంటే బీసీసీఐ ఓ మెట్టు దిగిరావాల్సిందే.

Also Read: Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

  Last Updated: 26 Jul 2024, 02:44 PM IST