Site icon HashtagU Telugu

Russian Cup Football : ఫుట్ బాల్ మైదానంలో ఘర్షణ…ఒకరినొకరు తన్నుకున్న ఆటగాళ్లు…!!

Football

Football

ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా… రష్యాకప్ లో సెయింట్ పీటర్స్ బర్గ్, స్పార్టక్ మాస్కో మధ్య జరిగిన మ్యాచ్ యుద్ధవాతావారణాన్ని తలపించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో మ్యాచ్ రిఫరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా ఆటగాళ్ల పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆరుగురు ఆటగాళ్లకు రిఫరీ రెడ్ కార్డ్స్ చూపించారు. ఈ ఘటన సిగ్గుతో తలదించుకునేలా చేసింది. క్రెస్టోవ్ స్కీ స్టేడియంలో జెనిట్ సెయింట్ పీటర్స్ బర్స్ , స్పార్టక్ మాస్కో మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ ఇంజురీ సమయంలో ఈ వివాదం మొదలైంది. ఇరు జట్ల ఆటగాలు ఘర్షణ పడటం ప్రారంభించారు. ఏం జరిగిందో తెలియదు కానీ జెనిట్ సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందిన రోడ్రిగో ప్రాడో రిఫరీ ముందు స్పార్టక్ ఆటగాళ్లను తన్నుతూ కనిపించాడు. దీంతో స్పార్టక్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్ అలెగ్జాండర్ సోబోలెవ్ కూడా పిడిగుద్దులు గుద్దాడు. దీంతో మిగిలిన ఆటగాళ్లంతా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రష్యాన్ బ్రాడ్ కాస్టర్ మ్యాచ్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

మ్యాచ్ రిఫరీ వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు చేయిజారిపోవడంతో రెడ్ కార్డులను చూపించాడు. అయినప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే రెడ్ కార్డు చూపించిన ఆటగాళ్లు ఈ మ్యాచ్ అసలు రాణించలేకపోయారు.