SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ లో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం, 7 సిక్స్‌లతో వీర విహారం

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం అంతా ఇంతా కాదు. బంతి బంతికి రస్సెల్ విధ్వంసం కళ్ళముందు కనిపించింది. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు సన్ రైజర్స్ బౌలర్లు చేతులెత్తేశారు.

SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం అంతా ఇంతా కాదు. బంతి బంతికి రస్సెల్ విధ్వంసం కళ్ళముందు కనిపించింది. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు సన్ రైజర్స్ బౌలర్లు చేతులెత్తేశారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే మైదానంలో అభిమానులు హోరెత్తించారు. ఫలితంగా కేవలం 20 బంతు, ల్లో అర్ధ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్, కోల్కతా మధ్య మ్యాచ్ జరుగుతుంది.కేకేఆర్ ఇన్నింగ్స్ లో 119 స్కోరు వద్ద 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుని తన భుజాలపైకి ఎక్కించుకున్నాడు రస్సెల్.రస్సెల్ రాగానే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. రస్సెల్ మొదట మయాంక్ మార్కండేని చెడుగుడు ఆదుకున్నాడు. అతని ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. 256 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ విధ్వంసం సృష్టించాడు. మైదానంలోని నాలుగు మూలల్లో రస్సెల్ భారీ సిక్సర్లు బాదాడు. ఈ కరీబియన్ బ్యాట్స్‌మెన్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టాడు మరియు కేవలం 20 బంతుల్లో అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు రస్సెల్ సాధించిన వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా ఇదే. రస్సెల్ రింకూ సింగ్‌తో కలిసి తుఫాను భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా కేకేఆర్ 200 స్కోర్ దాటింది. రస్సెల్ 25 బంతులు ఎదుర్కొని అజేయంగా 64 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రస్సెల్ 3 ఫోర్లు మరియు ఏడు భారీ సిక్సర్‌లను కొట్టాడు, దీని కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది.

ఆండ్రీ రస్సెల్‌తో పాటు ఫిల్ సాల్ట్ కూడా చెలరేగి ఆడాడు. కోల్‌కతా తరఫున తొలి మ్యాచ్‌ ఆడుతున్న సాల్ట్ 40 బంతుల్లో 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో సాల్ట్ 3 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. రింకూ సింగ్ 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

Also Read: Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం జైలులో సీఎం ఆఫీస్