Site icon HashtagU Telugu

RR vs LSG: రాజస్థాన్ vs లక్నో.. భీకర పోరులో గెలిచేదెవరు

RR vs LSG

RR vs LSG

RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సండేలో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియానికి చేరుకున్నారు. ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లున్నారు.

అయితే ఇరు జట్లలో గాయాల సమస్య వెంటాడుతూనే ఉంది. గాయపడిన ప్రసిద్ కృష్ణను రాజస్థాన్ కోల్పోనుంది, ఆడమ్ జంపా కూడా టోర్నమెంట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.మరోవైపు లక్నో తరఫున కేఎల్ రాహుల్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడికల్ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయం. గత సీజన్‌లో దేవదత్ రాజస్థాన్‌లో ఉన్నాడు. ఈ సారి లక్నోతో జతకట్టాడు. ఈ నేపథ్యంలో తన పాత జట్టుపై విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

KL రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కి వస్తే పడికల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్‌ స్టార్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ రాజస్థాన్ రాయల్స్‌కు ఫినిషర్ పాత్రను పోషించగలడు. దీంతో షిమ్రాన్ హెట్‌మెయర్, ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వంటి దిగ్గజాలతో జట్టు మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది. ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కూడా ఈ సీజన్‌కు ముందు లక్నో నుండి రాజస్థాన్‌కు వచ్చాడు.రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ , ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. లక్నోలో క్వింటన్ డి కాక్ , దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, కేఎల్ రాహుల్ , నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ జట్టు సభ్యులుగా కొనసాగుతున్నారు.

Also Read: Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వు

Exit mobile version