RR vs LSG: ఐపీఎల్ లో నేడు మరో ఉత్కంఠ మ్యాచ్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే అందరి కళ్ళు..!

ఐపీఎల్ 2023 (IPL 2023)లో 26వ లీగ్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి 7:30 నుండి జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 08:55 AM IST

ఐపీఎల్ 2023 (IPL 2023)లో 26వ లీగ్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి 7:30 నుండి జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు ఈ సీజన్‌లో తమ తమ ఆరో మ్యాచ్‌ను ఆడనున్నాయి. రాజస్థాన్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా 4 మ్యాచ్‌లు గెలుపొందగా, లక్నో 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. వీరిద్దరి మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో లక్నోకు చెందిన నికోలస్ పూరన్ నుంచి రాజస్థాన్‌కు చెందిన షిమ్రాన్ హిట్‌మెయర్ వరకు అందరి దృష్టి ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే ఉంటుంది.

నికోలస్ పూరన్

RCBతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన నికోలస్ పూరన్.. జట్టు తరపున 62 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో అంటే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతడి నుంచి మంచి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.

కేఎల్ రాహుల్

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ జట్టును గెలిపించలేకపోయినప్పటికీ ఇప్పుడు రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కూడా కెప్టెన్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Tilak Varma : హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో ముంబై టీం స్పెషల్ డిన్నర్.. సచిన్ కూడా వచ్చాడుగా..

సంజు శాంసన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఇప్పటి వరకు అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి 2 అర్ధ సెంచరీలు వచ్చాయి. అదే సమయంలో అతను రెండుసార్లు డకౌట్ కూడా అయ్యాడు. లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్‌ నుంచి మరో మంచి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.

జోస్ బట్లర్

ప్రతీసారి లాగానే ఈసారి కూడా రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. బట్లర్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

షిమ్రాన్ హెట్మెయర్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షిమ్రోన్ హెట్మెయర్ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 56 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.