Site icon HashtagU Telugu

RR vs KKR: ఐపీఎల్‌లో చివరి లీగ్ మ్యాచ్.. విజ‌యంతో ముగించాల‌ని చూస్తున్న రాజ‌స్థాన్‌

Sanju Samson

Sanju Samson

RR vs KKR: ఐపీఎల్ సీజన్ 2024 చివరి లీగ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ (RR vs KKR) మధ్య జరుగుతుంది. ఇందులో రాజస్థాన్ జట్టు గెలుపు ద్వారా ఓటముల పరంపరను ముగించాలనుకుంటోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ జట్టు వరుస పరాజయాలను చవిచూసింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టాప్ 2లో నిలవాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లేఆఫ్‌కు ముందు కోల్‌కతా జట్టు విజయాన్ని నమోదు చేయాలనుకుంటుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి ముఖాముఖి తలపడనున్నాయి. ఇరు జ‌ట్ల మధ్య చివరిసారి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.

రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ తన దేశానికి తిరిగి వచ్చాడు, దీని కారణంగా జట్టు బ్యాటింగ్ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. మ‌రో ఓపెన‌ర్ యశస్వి నిలకడగా పరుగులు చేయడంలో సఫలం కాకపోవడంతో సమస్య మరింత పెరిగింది. KKRతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలవాలంటే ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉండటం చాలా ముఖ్యం. KKR ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ కూడా తన దేశానికి తిరిగి వెళ్ళాడు. దీని కారణంగా ఇప్పుడు ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో కొత్త ఓపెనర్‌కు KKR అవకాశం ఇస్తుంది. ఈరోజు సాల్ట్ స్థానంలో రెహ్మానుల్లా గుర్బాజ్ ఆడే అవ‌కాశం ఉంది.

Also Read: BSF Recruitment 2024: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. వారు మాత్ర‌మే ఈ ఉద్యోగాల‌కు అర్హులు..!

ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో రాజస్థాన్ జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, కోల్‌కతా జట్టు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరు జ‌ట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. ఇక గత 5 మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే.. అందులో రాజస్థాన్‌దే ఆధిపత్యం. ఇందులో RR జట్టు 4 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, KKR జట్టు ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.

RR vs KKR పిచ్ రిపోర్ట్

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ జ‌రిగింది. ఇందులో బౌలర్లకు సహాయం కనిపించింది. గౌహతిలోని ఈ మైదానం చాలా పెద్దది కాదు కాబట్టి ఇక్కడ చాలా ఫోర్లు, సిక్స్‌లు కనిపిస్తాయి. ఈ మ్యాచ్ కొత్త పిచ్‌లో జరగనుంది. కాబట్టి నేటి పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉండే అవ‌కాశ‌ముంది.

వాతావరణ నివేదిక

రాజస్థాన్, కోల్‌కతా మధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఉంది. మ్యాచ్ సమయంలో తుఫాను కూడా సంభవించవచ్చు, దాని కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. ఈరోజు గౌహతిలో జరిగే మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 80 శాతం ఉంది. ఒకవేళ వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తే ఇరు జ‌ట్ల‌కు చెరొక పాయింట్ ల‌భిస్తోంది. మ్యాచ్‌లో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండే అవకాశం ఉంది.