Site icon HashtagU Telugu

RR vs KKR: రాజస్థాన్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు.. సన్ రైజర్స్ దే సెకండ్ ప్లేస్

RR vs KKR

RR vs KKR

RR vs KKR: ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ ముగిసింది. చివరి మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. రాజస్థాన్, కోల్ కత్తా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ జరిపించేందుకు అంపైర్లు చివరి వరకూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివర్లో వర్షం తగ్గడంతో 7 ఓవర్ల మ్యాచ్ జరపాలని నిర్ణయించారు. దీని కోసం టాస్ వేయగా…కోల్ కత్తా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే కాసేపటికే మళ్లీ వర్షం పెరిగిపోవడంతో మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. ఫలితంగా రాజస్థాన్ మూడో స్థానంలో నిలిస్తే…చివరి మ్యాచ్ లో పంజాబ్ పై గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

రెండు జట్లకు 17 పాయింట్లే ఉన్నప్పటికీ రాజస్థాన్ తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్‌తో హైదరాబాద్ టాప్-2లో నిలిచింది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కింది. టేబుల్ టాపర్ అయిన కేకేఆర్‌తో క్వాలిఫయర్-1లో విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ చేరుతోంది. ఓడితే.. క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. కాగా సన్ రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. హైస్కోరింగ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేజాతో విజయం సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగుళూరు , రాజస్థాన్ తలపడనున్నాయి.

Also Read: Toilet: టాయిలెట్ కమోడ్ బ్యాడ్ స్మెల్ వస్తుందా.. ఈ టిప్స్ ఫాలోకండి

Exit mobile version