Site icon HashtagU Telugu

Royal Challengers Bengaluru: చిన్న‌స్వామి స్టేడియంలో ఉత్కంఠ‌భ‌రిత పోరు.. చెన్నైపై 2 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ గెలుపు!

Royal Challengers Bengaluru

Royal Challengers Bengaluru

Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను 2 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 213 పరుగులు చేసింది. దానికి బదులుగా చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లో తమ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే (Ayush Mhatre) ఈ మ్యాచ్‌లో 94 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రవీంద్ర జడేజా అజేయంగా 77 పరుగులు కూడా వృథా అయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌కు 214 పరుగుల భారీ లక్ష్యం లభించింది. దానికి జవాబుగా చెన్నై ఓపెనర్లు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు. షేక్ రషీద్ కేవలం 14 పరుగులు చేశాడు. కానీ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేతో కలిసి 4.3 ఓవర్లలోనే సీఎస్‌కే స్కోర్‌ను 50 పరుగులు దాటించాడు. సామ్ కరన్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేక 5 పరుగులకే ఔట్ అయ్యాడు.

చెన్నై 58 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి ఫోర్లు, సిక్స్‌ల‌ వర్షం కురిపించారు. మాత్రే 48 బంతుల్లో 94 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో 6 పరుగులు చేసి ఉంటే ఐపీఎల్ చరిత్రలో రెండవ అతి పిన్న వయస్కుడిగా సెంచరీ సాధించేవాడు. అతను తన 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. మాత్రే, జడేజా మధ్య 114 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

జడేజా-మాత్రే కష్టం వృథా

ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నంత వరకు సీఎస్‌కే విజయం సులభంగా కనిపించింది. మాత్రే 94 పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత జడేజా బాధ్యతలు స్వీకరించాడు. అతను చివరి వరకు క్రీజ్‌లో నిలిచి 45 బంతుల్లో 77 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చెన్నైకి ఉపయోగపడలేదు. ఎమ్మెస్ ధోని మరోసారి నిరాశపరిచాడు. మ్యాచ్‌ను ఫినిష్ చేయడానికి ముందే 12 పరుగులతో ఔట్ అయ్యాడు.

Also Read: Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?

యశ్ దయాళ్ ఉత్కంఠభరిత ఓవర్, ఆర్‌సీబీ విజయం

సీఎస్‌కేకు చివరి ఓవర్‌లో విజయం కోసం 15 పరుగులు అవసరం. మొదటి రెండు బంతుల్లో ఒక్క పరుగు వచ్చింది. కానీ మూడో బంతికి యశ్ దయాళ్ ధోనిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. నాల్గవ బంతిని నో-బాల్‌గా ప్రకటించారు. ఆ బంతిని శివమ్ దూబే సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను సీఎస్‌కే వైపు మళ్లించాడు. కానీ చివరి 2 బంతుల్లో మ్యాచ్ తిరిగిపోయింది. చివరి 2 బంతుల్లో యశ్ దయాళ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్‌సీబీకి 2 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం లభించింది.