RCB Win: చెలరేగిన పాటిదార్…బెంగుళూరు విక్టరీ

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ ​క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - May 26, 2022 / 04:49 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ ​క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగ‌ళూరు ఆర్‌సీబీ 207 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలోనే కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ ను కోల్పోవ‌డం బెంగ‌ళూరును దెబ్బ‌కొట్టింది. కోహ్లీ కూడా
24 బంతుల్లో 25 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కోహ్లి ఔట్ అయిన త‌ర్వాత బ్యాటింగ్ దిగిన మాక్స్‌వెల్ మెరుపులు ఎక్కువ సేపు సాగ‌లేదు.
ఒక‌వైపు వికెట్లు కోల్పోతున్నా ర‌జ‌త్ పాటిదార్ త‌న బ్యాటింగ్ జోరును కొన‌సాగించాడు. 29 బంతుల్లో హాఫ్‌ సెంచ‌రీ పూర్తిచేసుకున్న అత‌డు సిక్స‌ర్లు,ఫోర్ల‌తో ల‌క్నో బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతడికి దినేష్ కార్తిక్ చక్కటి సహకారాన్ని అందించాడు.
చమీర వేసిన 19వ ఓవర్ లో పాటిదార్, కార్తిక్ చెరో సిక్స్, ఫోర్ కొట్టడంతో బెంగళూరు రెండు వందల పరుగుల మైలురాయి దాటింది.రజత్ పాటిదార్ 54 బంతుల్లో ఏడు సిక్సర్లు, 12 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. దినేష్ కార్తిక్ 23 బాల్స్ 37 పరుగులు చేశాడు.

208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆఖరి వరకు పోరాడినప్పటికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలోనే దికాక్ వికెట్ కోల్పోవడం లక్నో విజయావకాశాలపై ప్రభావం చూపింది. కెప్టెన్ రాహుల్ 79 , దీపక్ హుడా 45 రన్స్ తో రాణించిన ఫలితం లేకపోయింది. చివర్లో స్టోనిస్ , లూయిస్ , క్రునల్ పాండ్య విఫలమవడం లక్నో ఓటమికి కారణం గా చెప్పొచ్చు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 79 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగా తలా ఒక వికెట్‌ తీశారు. శుక్రవారం రాజస్తాన్‌తో క్వాలిఫయర్‌-2లో బెంగుళూరు అమితుమీ తేల్చుకోనుంది.

 

Pic: Twitter Image