Site icon HashtagU Telugu

South Africa Cricketer: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కన్నుమూత‌!

South Africa Cricketer

South Africa Cricketer

South Africa Cricketer: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా క్రికెట్ ప్రపంచంకు షాకింగ్ వార్త అందింది. దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ (South Africa Cricketer) మృతితో క్రికెట్‌ ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. టెస్టు క్రికెట్‌లో అత్యంత వృద్ధుడైన రాన్ డ్రేపర్ 98 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనింగ్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ పాత్రను డ్రేపర్ పోషించాడు.

రాన్ డ్రేపర్ అత్యంత పాత టెస్ట్ క్రికెటర్

దక్షిణాఫ్రికాకు చెందిన రాన్ డ్రేపర్ 98 ఏళ్ల 63 రోజుల వయసులో గ్కెబెరాహాలో మరణించాడు. డ్రేపర్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ప్రకటించారు. డ్రేపర్ 1950లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రాన్ డ్రేపర్ మరణానంతరం దక్షిణాఫ్రికాకు చెందిన నీల్ హార్వే ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. దీనికి ముందు, ఎక్కువ కాలం జీవించిన టెస్టు క్రికెటర్లలో దక్షిణాఫ్రికా పేరు కూడా ముందు వరుసలో ఉంది. నార్మన్ గోర్డాన్ 2016లో 103 ఏళ్ల వయసులో మరణించాడు. అతనితో పాటు, జాన్ వాట్కిన్స్ కూడా 2021 లో 98 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

Also Read: New Rations Card : దరఖాస్తుదారుల్లో అయోమయం.. రేషన్‌ కార్డులపై అప్డేట్‌..

డ్రేపర్ ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు

రాన్ డ్రేపర్ 1926 డిసెంబర్ 24న జన్మించాడు. 1949/50లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ప్రొవిడెన్స్ జట్టు కోసం డ్రేపర్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టులో ఆడే అవకాశం లభించింది. ఆఫ్రికా తరఫున అతను 3 ఇన్నింగ్స్‌ల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే డ్రేపర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు. డ్రేపర్ తన పదవీ విరమణ గృహంలో మంగళవారం మరణించాడు. ఆయన మరణ వార్తను ఆయన అల్లుడు నీల్ థామ్సన్ శుక్రవారం ధృవీకరించారు.