Fifa World Cup 2022: కక్కుర్తి పడితే జైలుకే.. సాకర్ ఫాన్స్ కి ఖతార్ షాక్

యూరోపియన్ దేశాలలో సాకర్ మ్యాచ్ లు, టోర్నీలంటే హంగామా మామూలుగా ఉండదు.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 03:04 PM IST

యూరోపియన్ దేశాలలో సాకర్ మ్యాచ్ లు, టోర్నీలంటే హంగామా మామూలుగా ఉండదు. ఇక వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ అంటే ఫుట్ బాల్ ఫాన్స్ కి పండగే. అయితే మ్యాచులకు ముందు పార్టీలు.. వేశ్యలతో సెక్స్ సర్వసాధారణాంశం. బ్రెజిల్, అర్జింటీనా, స్పెయిన్ తో పాటు యూకేలో నిర్వహించే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో ఇవన్నీ చాలా సాధారణం. ప్రపంచ కప్ ఎక్కడ జరిగినా ఆటతో పాటు ఈ ఎక్స్ ట్రా యాక్టివిటీస్ లోనూ ఫాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందుకే సాకర్ వరల్డ్ కప్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. అయితే వారి ఉత్సహంపై ఈ సారి నిర్వాహకులు నీళ్ళు చల్లారు. ఈ సారి ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే సహజంగానే ఖతార్ లో చాలా కఠిన నిభందనలు ఉంటాయి.
సాంప్రదాయక ముస్లిం దేశంగా ఉన్న ఖతార్ విచ్చలవిడి శృంగారం, పార్టీలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలోనే ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు భార్యాభర్తలైతే తప్ప గర్ల్ ఫ్రెండ్, లవర్స్ తో శృంగారం చేసుకునే అవకాశం లేదు. ప్రపంచకప్ లో మ్యాచ్ తర్వాత పార్టీలు నిషేధం. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు దానిని ఆస్వాదించాలే తప్ప పార్టీలు, సెక్స్ అని తిరిగితే జైళ్లకు వెళ్లడం ఖాయం. ప్రపంచకప్ జరిగే ప్రాంతాలలో సెక్స్ నిషేధం ఉంది. భార్యాభర్తలైతే తప్ప ఇతర వ్యక్తులతో శృంగారం నిషిద్ధం. ఇందుకు ఫ్యాన్స్ ప్రిపేర్ అయి రావాలని నిర్వాహకులు తెలిపారు. ఫిఫా ప్రపంచకప్ ఈవెంట్లలో పార్టీలు, సెక్స్ పై నిషేధించడం సాకర్ చరిత్రలో ఇదే తొలిసారి.

వివాహం కాని వారు హద్దు మీరి ప్రవర్తిస్తే అక్కడ శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి. నిభందనలు పాటించకుండా విచ్చలవిడి గా రెచ్చిపోతే ఏడేళ్ళ పాటు జైలు శిక్ష ఖాయం. ఒక్క రాత్రికి కక్కుర్తి పడితే జైలులో మగ్గిపోవాల్సిందేనని ఖతార్ పోలీసులు చెబుతున్నారు. ఇక ఖతార్ తాజా ఆదేశాలతో ఫుట్బాల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కాగా ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 21న నుంచీ డిసెంబర్ 18 వరకు జరుగుతుంది.
మొత్తంగా 32 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో పలువురు స్టార్ ప్లేయర్స్ సందడి చేయనున్నారు.