Site icon HashtagU Telugu

T20 World Cup 2024: గాయపడిన రోహిత్.. ప్రపంచకప్ ముందట టెన్షన్

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. ఈ సీజన్‌లోని ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌లలో జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. ఫలితంగా అఫీషియల్ గా ప్లేఆఫ్‌ల రేసు నుండి నిష్క్రమించింది. ముంబై పేలవ ప్రదర్శనకు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణమని అంటున్నారు. అభిమానులు కూడా అతడిని చప్రీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఆటతీరు, కెప్టెన్సీ నిర్ణయంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.

మే 26న ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. దాంతర్వాత విదేశీ గడ్డపై జరగనున్న టి20 ప్రపంచకప్ లో టీమిండియా పాల్గొనబోతుంది. ఇప్పటికే జట్టు సభ్యుల్ని కూడా ఖరారు చేశారు. ఈ మెగాటోర్నీకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా, హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్గ్ గా కొనసాగుతాడు. ఇక కోహ్లీని సెలెక్ట్ చేస్తారో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ బీసీసీఐ విరాట్ ని సెలెక్ట్ చేయడమే కాకుండా ఓపెనర్ గా ప్రమోట్ చేస్తుందంటున్నారు. దీంతో రన్ మెషిన్ ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ 100 కోట్ల మంది క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యే వార్త ఒకటి బయటకు వచ్చింది.

We’re now on WhatsAppClick to Join

కెప్టెన్ రోహిత్ శర్మ గాయానికి గురయ్యాడు. అతని గాయం చాలా తీవ్రంగా లేనప్పటికీ.. ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ వెన్నుముకతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా రోహిత్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ కూడా చేయలేదు. అంతేకాదు సరిగా బ్యాటింగ్‌ కూడా చేయలేకపోయాడు. కేవలం 12 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఈ సమయంలో రోహిత్ శర్మ ముఖంలో చాలా నిరాశ కనిపించింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కొంత గాయంతో ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు.దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మరి వెన్నునొప్పితో బాధపడుతున్న రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లలో రోహిత్ ఆడితే గాయం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్ దూరం అయిన ఆశ్చర్యం లేదు. రోహిత్‌ లేకపోతే.. వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఇబ్బందులు తప్పవు.

Also Read: Bajaj CNG Bike: జూన్ 18న తొలి సీఎన్‌జీ బైక్‌ను విడుద‌ల చేయ‌నున్న బ‌జాజ్‌..!