Rohit Sharma Health: హిట్ మ్యాన్ ఆరోగ్యంపై అప్ డేట్స్ ఇచ్చిన స్పెషల్ పర్సన్…

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఎప్పుడు కోలుకుంటాడోననీ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ ఐసోలేషన్ లో ఉన్నాడు.

  • Written By:
  • Updated On - June 28, 2022 / 01:20 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఎప్పుడు కోలుకుంటాడోననీ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ ఐసోలేషన్ లో ఉన్నాడు. టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ కోసం బర్మింగ్ హామ్ వెళ్లిపోగా…భారత కెప్టెన్ మాత్రం లీస్టర్ షైర్ లోనే ఉండిపోయాడు. జూలై 1 నుంచీ జరిగే టెస్ట్ మ్యాచ్ కి రోహిత్ అందుబాటులో ఉంటాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. దీంతో అతని ఆరోగ్యంపై అప్ డేట్స్ తెలుసుకునేందుకు వేచి చూస్తున్నారు. తాజాగా హిట్ మ్యాన్ పరిస్థితిపై ఒక స్పెషల్ పర్సన్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు రోహిత్ కూతురు సమైరా.

రోహిత్ భార్య రితికా, కుమార్తె సమైరా… హోటల్ నుంచి బయటికి వస్తున్న సమయంలో కొందరు ఫాన్స్ డాడీ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమైరా క్యూట్‌గా సమాధానాలు ఇచ్చింది.
డాడీ రూమ్‌లో ఉన్నారు. ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.డాడీ పూర్తిగా కోలుకోవడానికి ఫుల్లీ వన్ మంత్ పడుతుంది అంటూ ముద్దు ముద్దుగా ఇంగ్లీషులో రిప్లై ఇచ్చింది.సమైరా క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఐసోలేషన్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా రోహిత్ శర్మ షేర్ చేశాడు. తాను బాగానే ఉన్నాననే అర్థం వచ్చేలా సింబల్ చూపిస్తున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేశాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్ గా బీసీసీఐ మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేసింది. ఇప్పటికే టీమిండియాతో కలిసిన మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.