Rohit Sharma: స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఈనెల(మే) 7న అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఈవార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటించనుంది. ఈ తరుణంలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు దూరం కావడం భారత జట్టుకు పెద్ద లోటు. అయితే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ముడిపడిన కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది.
Also Read :Mohanlal Biography: బర్త్‌డే వేళ మోహన్‌లాల్ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం
మహేంద్ర సింగ్ ధోనీ బాటలో..
ఈఏడాది (2025లో) టీమిండియా ఇంగ్లండ్ పర్యటన జరుగుతుండగా మధ్యలో రిటైర్మెంట్‌ను ప్రకటించాలనే అభిప్రాయానికి రోహిత్ వచ్చారట. ఈవిషయాన్ని బీసీసీఐ పెద్దలకు సైతం ఆయన తెలియజేశారట. అయితే వారు రోహిత్ ప్రతిపాదనను తిరస్కరించారట. 2014లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇలాగే చేశారు. ఆ ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా ఉండగా ధోనీ అకస్మాత్తుగా రిటైర్ అయ్యారు. ధోనీ(Rohit Sharma) బాటలోనే పయనించాలని రోహిత్ భావించారట.
Also Read :What Is Golden Dome : అమెరికా రక్షణకు గోల్డెన్ డోమ్.. ఎలా పనిచేస్తుంది ?
రోహిత్‌కు ఆ విషయం తేల్చి చెప్పారట
కీలకమైన ఇంగ్లండ్ టూర్ వేళ టీమిండియాలో సీనియర్ల కొరత ఉండకూడదని బీసీసీఐ సెలక్టర్లు అనుకున్నారట. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ లేకుంటే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుందని కలత చెందారట. అందుకే ఇంగ్లండ్ టూర్ జరుగుతుండగా రిటైర్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని రోహిత్‌కు బీసీసీఐ పెద్దలు, టీమిండియా సెలెక్టర్లు తేల్చి చెప్పారట. ఎలాగైనా ఇంగ్లండ్ పర్యటనలో భాగం కావాలని రోహిత్‌కు సూచించారట. టీమిండియాకు కెప్టెన్సీ చేయకున్నా పర్వాలేదు కానీ.. సాధారణ ప్లేయర్‌గానైనా ఇంగ్లండ్ టూర్‌లో జట్టు కోసం ఆడాలని రోహిత్‌ను కోరారట. ఈ పరిణామాల నేపథ్యంలో మే 7న రోహిత్ శర్మ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇక తాను టెస్ట్ క్రికెట్ ఆడనని ఆయన వెల్లడించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం సంచలనం రేపింది. కాగా, ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టీమ్‌ను మే 23కల్లా ప్రకటించే అవకాశముంది. పంత్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా, శుభ్‌మన్ గిల్‌లను కెప్టెన్సీకి ప్రధాన అభ్యర్థులుగా పరిశీలిస్తున్నారు.