ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మార్నస్ లబూషేన్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా స్టీవ్ స్మిత్ 845 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇటీవల పాకిస్థాన్ తో సిరీస్‌లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 757 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీకి తీవ్ర నిరాశే ఎదురైంది.. ఈ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి టాప్ 10 నుంచి మరింత కిందికి పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 742 పాయింట్లతో 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. ఇక రోహిత్ శర్మ కూడా 754 పాయింట్లతో ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు.
ఇక ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉండగా.. బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ తొలిస్థానంలో, టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. అలాగే ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, రెండో స్థానంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు.